Skip to main content

TS TET Paper-2: టెట్ పేప‌ర్-2 ప‌రీక్ష‌లో ఏఏ స‌బ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వ‌స్తాయంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌లే టెట్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే.
TS TET Paper-2 Syllabus
TS TET Paper-2 Syllabus

ఇక చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న అభ్య‌ర్థులకు ఇది శుభ‌వార్త‌. ఈ నేపథ్యంలో టెట్‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు ముందుగా సిల‌బ‌స్, ప‌రీక్షా విధానం గురించి తెలుసుకోవాలి. అలాగే టెట్ పేప‌ర్-2లో ఏఏ అంశం నుంచి ఎన్ని మార్కులు వ‌స్తాయో తెలుసుకుందామా..

ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

టెట్‌ పేపర్‌–2 స్వరూపం :

ఆయా సబ్జెక్ట్‌లలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు ప్రామాణికంగా పేర్కొనే టెట్‌ పేపర్‌–2ను కూడా నాలుగు విభాగాలుగా,150మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్‌ కూడా పూర్తిగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. వివరాలు..

విభాగం సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
1 చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి 30 30
2 లాంగ్వేజ్‌1 30 30
3 లాంగ్వేజ్‌ 2 (ఇంగ్లిష్‌) 30 30
4 సంబంధిత సబ్జెక్ట్‌  60 60
మొత్తం   150 150

తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

గ‌మ‌నిక‌:టెట్‌ పేపర్‌–1, పేపర్‌–2లను 150 మార్కులు చొప్పున నిర్వహిస్తారు.

  • నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్‌ విషయంలో.. మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ టీచర్స్‌ అభ్యర్థులు మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌ విభాగాన్ని, సోషల్‌ టీచర్లు సోషల్‌ స్టడీస్‌ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాలి.
  • సబ్జెక్ట్‌ పేపర్‌కు సంబంధించి కంటెంట్‌ నుంచి 24 ప్రశ్నలు, పెడగాజి నుంచి ఆరు ప్రశ్నలు చొప్పున ప్రతి సబ్జెక్ట్‌ విభాగం నుంచి అడుగుతారు. 
  • సైన్స్‌ సబ్జెక్ట్‌ విషయంలో ఫిజికల్‌ సైన్స్‌ నుంచి 12, బయలాజికల్‌ సైన్స్‌ నుంచి 12 ప్రశ్నలు చొప్పున కంటెంట్‌ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. మిగతా ఆరు ప్రశ్నలు సైన్స్‌ పెడగాగీ నుంచి అడుగుతారు.
  • సోషల్‌ విభాగంలో హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్‌ల నుంచి 48 కంటెంట్‌ ప్రశ్నలు, 12 పెడగాజి ప్రశ్నలు అడుగుతారు.
  • ఈ సబ్జెక్ట్‌ విభాగం విషయంలో రెండు అర్హతలు ఉన్న వారు తమకు ఆసక్తి ఉన్న విభాగం పరీక్ష రాసే అవకాశం అందుబాటులో ఉంది.
  • లాంగ్వేజ్‌–1 విభాగానికి సంబంధించి టెట్‌ పేపర్‌–1 మాదిరిగానే ఆయా లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.

TET/DSC 2022: కచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునే వారికి మాత్రమే..

అర్హత మార్కులు ఇవే..

రెండు పేపర్లుగా నిర్వహించే టెట్‌ పేపర్‌–1, పేపర్‌–2లలో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు పొందాలనే నిబంధన విధించారు. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో(90 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో(75 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో (60 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. ఈ మార్కులు సాధించిన వారికే టెట్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.

టీఎస్‌ టెట్‌–2022 ముఖ్య‌మైన తేదీలు ఇవే..
➤ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➤ ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 12 వరకు
➤ టెట్‌ తేదీ: జూన్‌ 12, 2022
➤ పేపర్‌–1: ఉదయం 9:30నుంచి 12:00 వరకు
➤ పేపర్‌–2: మధ్యాహ్నం 2:30నుంచి 5:00వరకు
➤ ఫలితాల వెల్లడి: జూన్‌ 27, 2022
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://tstet.cgg.gov.in

టీచర్‌ కొలువుకు తొలిమెట్టు.. టెట్‌లో అర్హత సాధించే ప్రణాళిక ఇదిగో..!

TS TET 2022: అభ్యర్థులకు శుభ‌వార్త‌.. ! ఇక‌పై టెట్‌ ఒక్కసారి రాస్తే..​​​​​​​

Published date : 21 Apr 2023 04:47PM

Photo Stories