TS TET 2022: టెట్‌కు ఏర్పాట్లు పూర్తి.. భారీగా దరఖాస్తులు..
Sakshi Education
జూన్ 12న జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలంగాణ టెట్ కన్వీనర్ రాధా రెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 6,29,352 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో పేపర్–1కు 3,51,468 మంది, పేపర్– 2కు 2,77,884 మంది దరఖాస్తు చేశారని జూన్ 7న ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,683 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2 ఉం టుందని తెలిపారు. ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
చదవండి:
Published date : 08 Jun 2022 04:42PM