Skip to main content

AP TET 2022: పరీక్ష, ఫలితాలు తేదీలు విడుదల

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET – August 2022)ను ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
TET 2022
టెట్ పరీక్ష, ఫలితాలు తేదీలు విడుదల

ఈమేరకు ఖఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశా జూన్‌ 10న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు జూన్‌ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు TET రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. జూన్‌ 16 నుంచి జులై 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. ‘https://cse.ap.gov.in’ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులకు సహకరించేందుకు జూన్‌ 13 నుంచి విద్యా శాఖ కార్యాలయంలో హెల్ప్‌ డెస్కును ఏర్పాటు చేస్తున్నారు. జూలై 26వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ Mock Tests నిర్వహిస్తారు. జూలై 25 నుంచి Halltickets జారీ చేస్తారు. ఒకసారి దరఖాస్తు సమర్పించాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల అభ్యర్థులు దరఖాస్తును నింపిన తర్వాత అన్ని వివరాలు జాగ్రత్తగా సరిచూసుకొని సబ్మిట్‌ చేయాలి. TET Syllabusను కూడా పాఠశాల విద్యా శాఖ ఇన్ఫర్మేషన్‌ బులెటిన్ లో పొందుపరిచింది.

చదవండి: 

పరీక్షలిలా..

పరీక్షలు పేపర్‌ 1ఏ, పేపర్‌ 1 బీ, పేపర్‌ 2 ఏ, పేపర్‌2 బీలుగా జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు జరుగుతాయి. ప్రాథమిక కీని ఆగస్టు 31న విడుదల చేస్తారు. దానిపై సెప్టెంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది కీని సెప్టెంబర్‌ 12న విడుదల చేస్తారు. సెప్టెంబర్‌ 14న ఫలితాలు ప్రకటిస్తారు.

చదవండి: 

డీఎస్సీలో వెయిటేజి

టెట్‌లో అర్హతకు నిర్ణీత మార్కులను పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఆ మార్కులు సాధిస్తేనే టెట్‌లో క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తారు. అర్హత మార్కులు జనరల్‌ అభ్యర్థులకు 60 శాతం రావాలి. బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలి. టెట్‌ ధ్రువపత్రాల చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండేది. తాజా నిబంధనల ప్రకారం జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. టెట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల స్కోరుకు ఉపాధ్యాయ నియామకాల్లో (డీఎస్సీలో) 20 శాతం మేర వెయిటేజీ కల్పిస్తారు.

Published date : 11 Jun 2022 02:31PM

Photo Stories