Skip to main content

TS TET 2024 Notification: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)- 2024 నోటిఫికేషన్‌ విడుదల..దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Important Dates for Telangana TET 2024   Apply Now for Telangana TET 2024   Telangana TET Eligibility Criteria  Important Dates for Telangana TET 2024  TS TET 2024 Notification details and exam pattern and exam date   Telangana Teacher Eligibility Test 2024 Notification

అర్హత: డీఈఐఈడీ/డీఈడీ/బీఈడీ/లాంగ్వేజ్‌ పండిట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అర్హులే.

పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) జరుగుతుంది. టెట్‌ పరీక్షలో పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. పేపర్‌-1 ఒకటి నుంచి ఐదో తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు, పేపర్‌-2 ఆరు నుంచి పదో తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు. పరీక్ష సమయం 2 1/2 గంటలు.
అర్హతా మార్కులు: అభ్యర్థులు జనరల్‌ కేటగిరీ లో 90మార్కులు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే టీ­ఆర్‌టీ-డీఎస్సీ రాసేందుకు అర్హత సాధిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 27.03.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.04.2024
పరీక్ష తేది: 20.05.2024 నుంచి 03.06.2024 వరకు పరీక్షలు జరుగుతాయి.

వెబ్‌సైట్‌: https://schooledu.telangana.gov.in/ISMS/

చదవండి: Teacher Jobs in Telangana (DSC 2024): 11,062 టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ వివరాలు.. ఎంపిక విధానం, రాత పరీక్షలో రాణించేందుకు ప్రిపరేషన్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 18 Mar 2024 05:04PM

Photo Stories