Woman Success: ఇబ్బందుల్లో కూడా గమ్యాన్ని సాధించింది
Sakshi Education
నిరుపేదరికంలో ఉన్నప్పటికీ తన శ్రద్ద చదువులో ఎప్పడూ తప్పలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదల వదలలేదు ఈ యువతి. ఇలా ప్రయాణిస్తూనే తను ఎస్ఐ కు సిద్ధపడి పరీక్షలు రాసిన ఈ యువతి ప్రయాణం ఒక చిన్ని కథనంలో తెలుసుకుందాం..
కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన బొల్లెబోయిన హేమలత ఎస్సై పోస్టుకు ఎంపికయ్యారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన బొల్లెబోయిన పద్మ, కుమార స్వామి దంపతుల పెద్ద కూతురు ఈ యువతి చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులకు చలించిపోయేది. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే పట్టుదలతో తన చదువును కొనసాగించింది.
Success Story : లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూనే చదివా.. గ్రూప్-1 కొట్టానిలా..
ఈ క్రమంలో ఎస్సై ఉద్యోగం కోసం పరీక్షకు సిద్ధపడింది. పరీక్షల ఫలితాల ఆధరంగా ఎస్టుకు ఎంపికైంది. ఎస్సై పోస్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా, తమ కూతురు ఎస్సైగా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు పద్మ, కుమారస్వామి వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Published date : 03 Oct 2023 01:06PM