Skip to main content

యూకే...‘ఓకే’.. చెప్పాలంటే..!

ఉన్నత విద్యకు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా తర్వాత లక్ష్యం.. యునెటైడ్ కింగ్‌డమ్ (యూకే). గత కొంత కాలంగా వీసా విధానాల్లో మార్పుల కారణంగా యూకేలో అడుగుపెట్టే భారత విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది.
 అయితే దీర్ఘకాలిక దృష్టితో.. ప్రణాళికతో ప్రయత్నిస్తే.. యూకేలో ఉన్నతవిద్య అవకాశాలు అందుకోవడం సులభమే అంటున్నారు నిపుణులు! త్వరలో యూకేలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉన్నత విద్య.. అందుకునే మార్గాల గురించి తెలుసుకుందాం...

ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కేంబ్రిడ్‌‌జ యూనివర్సిటీలకు నెలవు యూకే. అందుకే ఆ దేశంలో ఉన్నత విద్య అభ్యసించాలనే ఆకాంక్ష భారతీయ విద్యార్థుల్లో అధికంగానే ఉంటోంది. ముఖ్యంగా ట్రంప్ సర్కారు వచ్చాక అమెరికాలో కఠిన నిబంధనలు అమలవుతున్న నేపథ్యంతో విదేశీ విద్య ఔత్సాహికులకు రెండో ప్రత్యామ్నాయ గమ్యంగా నిలుస్తోంది యునెటైడ్ కింగ్‌డమ్. ఆర్‌‌ట్స నుంచి హ్యుమానిటీస్ వరకు.. సైన్‌‌స రీసెర్చ్ నుంచి టెక్నికల్ కోర్సుల వరకు.. విలక్షణమైన బోధనతో నాణ్యమైన కోర్సులు అందించడంలో యూకేకు మంచి పేరుంది. రెండేళ్ల క్రితం అమలు చేసిన యూకే పైలట్ వీసా స్కీమ్.. ఇటీవల ప్రవేశ పెట్టిన యూకేఆర్‌ఐ-సైన్‌‌స రీసెర్చ్ అండ్ అకడమియా స్కీమ్‌లు భారతీయ విద్యార్థులకు అనుకూలమని చెప్పొచ్చు.

ప్రధానంగా కలిసొచ్చే అంశం
యూకేలో ఏడాది వ్యవధిలోనే మాస్టర్ స్థాయి కోర్సులను పూర్తిచేసుకోవచ్చు. కోర్సుల వ్యవధి ఏడాదే అయినా.. వీటికి అంతర్జాతీయ స్థాయిలో అకడమిక్, ఇండస్ట్రీ పరంగా గుర్తింపు లభిస్తోంది. దాదాపు 65శాతం ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో ఫాస్ట్‌ట్రాక్ ప్రోగ్రామ్‌ల పేరుతో ఏడాది వ్యవధిలోనే కోర్సు పూర్తవుతుంది. వీటికి యూకే ఉన్నత విద్యాశాఖ గుర్తింపు కూడా లభిస్తోంది. ఇలా.. ఏడాదిలోనే అంతర్జాతీయ గుర్తింపు ఉండే పీజీ పూర్తిచేసే వీలుండటం.. విలువైన సమయం, వ్యయం పరంగా మన విద్యార్థులు యూకేను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రముఖ యూనివర్సిటీల్లో మాత్రం మాస్టర్ ప్రోగ్రామ్స్ వ్యవధి రెండేళ్లుగానే ఉంటోంది.

ఏటా రెండుసార్లు
యూకేలోని యూనివర్సిటీలు.. స్ప్రింగ్, ఫాల్‌సెషన్‌‌స పేరుతో ఏటా రెండుసార్లు (ఆగస్ట్టు/సెప్టెంబర్; డిసెంబర్/జనవరి) ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తాయి. విద్యార్థులు తాము ప్రవేశం పొందాలనుకున్న సెషన్‌కు కనీసం ఆర్నెల్ల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన కసరత్తు (యూనివర్సిటీ, కోర్సు ఎంపిక, అర్హతల వివరాలు తదితర అంశాలు)ను కనీసం ఎనిమిదినెలల ముందుగా పూర్తిచేసుకుంటే.. అకడమిక్ సెషన్ ప్రారంభమయ్యే సమయానికి స్టూడెంట్ వీసా చేతికందుతుంది.

టైర్-4 కేటగిరీ
ముందుగా విద్యార్థులు చేరాలనుకుంటున్న యూనివర్సిటీలు, కోర్సులు, అవసరమైనఅర్హతలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఆ తర్వాత యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకొని ప్రవేశం లభించినట్లు ధ్రువీకరణ పత్రం పొందాలి. దాని ఆధారంగా స్టూడెంట్ వీసా (టైర్-4 కేటగిరీ వీసా)కు దరఖాస్తు చేసుకోవాలి. యూనివర్సిటీ ఆఫర్‌లెటర్ (కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సప్టెన్‌‌స స్టడీస్)నువీసా దరఖాస్తుకు జతచేయడం తప్పనిసరి. దీంతోపాటు ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఇతర ధ్రువీకరణ పత్రాలు కూడా అందించాల్సి ఉంటుంది. అవి.. పాస్‌పోర్ట్, వీసా ఫీజు, బయోమెట్రిక్ డిటెయిల్స్, సీఏఎస్ లెటర్, ఫీజు రశీదు, వ్యక్తిగత బ్యాంక్ స్టేట్‌మెంట్, అకడమిక్ సర్టిఫికెట్లు.

వీసాకు పాయింట్ల విధానం
-టైర్-4 వీసాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వీసా మంజూరు చేసే విషయంలో యూకే ఇమిగ్రేషన్ శాఖపాయింట్ల విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం స్టూడెంట్ వీసాకు గరిష్టంగా 40పాయింట్లు కేటాయిస్తారు. ఈ పాయింట్లకు సంబంధించి నిర్దేశిత ప్రమాణాల పరంగా అభ్యర్థులు పొందిన పాయింట్ల ఆధారంగా వీసా మంజూరుపై నిర్ణయం తీసుకుంటారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇలాఉంటుంది.

-40 పాయింట్లలో 30 పాయింట్లను సీఏఎస్‌కు కేటాయిస్తారు
-మిగతా పది పాయింట్లను విద్యార్థులు యూకేలో చదువుకునే సమయంలో అయ్యే ఖర్చులకు సంబంధించిన అంశాలకు కేటాయిస్తారు.

-ఈ పాయింట్ల ఆధారంగా విద్యార్థులకు వీసా మంజూరు చేస్తారు.
-టైర్-4కు దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి రెండు వారాల వ్యవధిలో వీసా మంజూరు అవుతుంది. కాబట్టి అడ్మిషన్ ఖరారు చేసుకున్న విద్యార్థులు.. అకడమిక్ సెషన్ ప్రారంభానికి మూడు నెలల ముందుగానే వీసాకు దరఖాస్తు చేసుకునేలా అన్నిరకాల పత్రాలు సిద్ధం చేసుకోవాలి.

వినూత్న కోర్సులకు నెలవు
యూకే విశ్వవిద్యాలయాలు వినూత్న కోర్సులకు నెలవుగా పేర్కొనొచ్చు. ప్రధానంగా ఆర్‌‌ట్స అండ్‌హ్యుమానిటీస్; ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ;నేచురల్ సెన్సైస్; మెడికల్ సెన్సైస్ కోర్సులను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా యూకే వర్సిటీలకుమంచి పేరుంది. ఆర్‌‌ట్స అండ్ హ్యుమానిటీస్ కోర్సులకు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, యూనివర్సిటీఆఫ్ కేంబ్రిడ్‌‌జ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్‌పొలిటికల్ సైన్‌‌స (ఎల్‌ఎస్‌ఈ), యూనివర్సిటీ కాలేజ్‌లండన్ (యూసీఎల్), ద యూనివర్సిటీ ఆఫ్ ఈడెన్‌బర్గ్‌లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది.

ఫీజులు
అమెరికాతో పోల్చుకుంటే యూకేలో మాస్టర్‌స్థాయి కోర్సుల వ్యయం కొంత తక్కువగా ఉండటం కలిసొచ్చే అంశంగా పేర్కొనవచ్చు. ఏడాది వ్యవధిగల కోర్సుల్లో ఫీజుల వ్యయం సగటున పది వేలపౌండ్ల నుంచి 34 వేల పౌండ్ల మధ్యలో ఉంటుంది.నివాస ఖర్చు కూడా స్వల్పంగానే ఉంటుంది. షేర్డ్‌రూమ్, ఇతర వ్యక్తిగత ఖర్చులను కలుపుకుంటేనెలకు 650 పౌండ్ల నుంచి 800 పౌండ్ల వరకూ అవుతుంది.

స్కాలర్‌షిప్స్ చేయూత
యూకేలో ఉన్నతవిద్యకు పలు రకాల స్కాలర్‌ిషిప్‌లు అందుబాటులో ఉండటం భారతీయ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పొచ్చు. అక్కడి యూనివర్సిటీలు ప్రవేశం పొందిన విద్యార్థులకు వివిధ స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి. ప్రభుత్వం సైతం యూజీ, పీజీ విద్యార్థులకు పలు స్కాలర్స్‌షిప్స్ పథకాలు అమలుచేస్తోంది. అంతర్జాతీయ విద్యార్థుల కోసం పలు ఇంజనీరింగ్ స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉండటం విశేషం. కామన్వెల్త్ స్కాలర్‌షిప్స్, దషివెనింగ్ స్కాలర్‌షిప్స్, రోడ్‌‌స స్కాలర్‌షిప్స్, వెస్ట్‌మినిస్టర్ ఇంటర్నేషనల్ స్కాలర్‌షిప్స్, కార్డిఫ్‌యూనివర్సిటీ స్కాలర్‌షిప్స్ కోసం విద్యార్థులు ప్రయత్నించొచ్చు.

ఉద్యోగాన్వేషణ
విదేశాల్లో ఉన్నతవిద్య పూర్తిచేసుకున్నాక.. అక్కడే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంగా యువత ఆలోచన ఉంటుంది. కానీ.. యూకేలో ఇటీవల తెచ్చిన కొన్ని నిబంధనల కారణంగా పోస్ట్ స్టడీ వర్క్‌అవకాశాలు సన్నగిల్లాయని చెప్పొచ్చు. విద్యార్థులుతాము కోర్సు పూర్తిచేసుకునే సమయానికే నెలకు20,800 పౌండ్ల జీతంతో కొలువు సాధిస్తే.. సదరు ఎంప్లాయర్ ఇచ్చే లెటర్ ఆధారంగా.. రెండేళ్ల కాలపరిమితితో ఉండే పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు ఎంప్లాయర్‌కు ప్రభుత్వ కార్మికశాఖ గుర్తింపు ఉంటే వర్క్ పర్మిట్ లభిస్తుంది.

-టియర్-5 ప్రోగ్రామ్ పరిధిలో ఈ విధానంప్రకారం అకడమిక్ ఎక్స్ఛేంజ్‌లో భాగంగా ఇంటర్న్‌షిప్ అవకాశం పొందిన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యాక 12 నెలలు పోస్ట్ స్టడీ వర్క్‌అవకాశం లభిస్తుంది.

-టియర్-4 పరిధిలోని డిగ్రీ లేదా ఆపై స్థాయికోర్సులు చదువుతున్న విద్యార్థులు తమ వీసాగడువు పూర్తయ్యాక.. నాలుగు నెలలు అక్కడేఉండి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఈ సమయంలో ఉద్యోగం పొందిన విద్యార్థులు గరిష్టంగా ఆరేళ్లపాటు అక్కడ కొనసాగే అవకాశముంది.

పైలట్ వీసా స్కీమ్
యూకేలో ఉన్నతవిద్య పూర్తిచేసుకున్న విద్యార్థులకు పోస్ట్ స్టడీ వర్క్ అవకాశాల్లో భాగంగా మరోముఖ్య ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న మార్గం..పైలట్ వీసా స్కీమ్. రెండేళ్ల క్రితం అమల్లోకి వచ్చిన ఈ విధానం ప్రకారం యూకే ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొన్న యూనివర్సిటీల్లో కనీసం పదమూడు నెలల వ్యవధి కలిగిన కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు.. సదరు కోర్సు పూర్తయ్యాక ఆరు నెలలపాటు యూకేలోనే నివసించి ఉద్యోగాన్వేషణ సాగించొచ్చు. ఆసమయంలో ఉద్యోగం లభిస్తే టియర్-2 (వర్క్‌వీసా) కేటగిరీకి దరఖాస్తు చేసుకుని వర్క్ పర్మిట్ పొందొచ్చు. తొలుత నాలుగు యూనివర్సిటీలకే (కేంబ్రిడ్‌‌జ యూనివర్సిటీ; ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ; ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్; బాత్ స్కూల్ ఆఫ్‌మేనేజ్‌మెంట్) పరిమితం చేసిన ఈ విధానాన్ని 2018-19 విద్యా సంవత్సరం నుంచి 23 ఇన్‌స్టిట్యూట్‌లు/యూనివర్సిటీలకు విస్తరించారు.

యూకేఆర్‌ఐ - ఆధ్వర్యంలో సరికొత్త స్కీమ్
దేశంలో పరిశోధనలు, ఆవిష్కరణలను పెంచాలని, ఇందుకోసం నిర్దేశిత విభాగాల్లో అత్యున్నత నైపుణ్యాలున్న విదేశీ నిపుణులను ఆహ్వానించాలనే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. దీన్ని యూకేరీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ (యూకేఆర్‌ఐ) మరో 12రీసెర్చ్ సంస్థలతో కలిసి పర్యవేక్షిస్తుంది. వీటికి దరఖాస్తు చేసుకున్న నిపుణులను స్పాన్సర్ చేస్తుంది. యూకే ఆర్‌ఐ నుంచి స్పాన్సర్‌షిప్ లెటర్ అందిందంటే వీసా లభించినట్లే. ఇలా ఈవిధానంలో వీసా పొందిన వ్యక్తులు రెండేళ్ల వరకు అక్కడ నిర్దేశిత రీసెర్చ్, అకడమిక్ కార్యకలాపాల ట్రైనింగ్ పొందే అవకాశం లభిస్తుంది.

యూకే.. ఫీజుల వివరాలు
ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ 19-30వేల పౌండ్లు
ఆర్‌‌ట్స, హ్యుమానిటీస్ 10-20 వేల పౌండ్లు
మేనేజ్‌మెంట్ 10-25 వేల పౌండ్లు
నేచురల్ సెన్సైస్ 12-25వేల పౌండ్లు

వీటికి అదనంగా విద్యార్థులు నివాసఖర్చులు, ఇతర వ్యక్తిగత వ్యయాల కోసం ఏడాదికి 12-15 వేల పౌండ్లు

టాప్-10 యూనివర్సిటీలు
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం యూకేలో టాప్-10 యూనివర్సిటీల వివరాలు...
-యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్
-యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్‌‌జ
-ఇంపీరియల్ కాలేజ్ లండన్
-యూనివర్సిటీ కాలేజ్ లండన్
-ది యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్డ్
-ది యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్
-కింగ్‌‌స కాలేజ్ లండన్
-లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్
-యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్
-ది యూనివర్సిటీ ఆఫ్ వార్విక్

యూకేకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

2012-13

22,385

2013-14

19,750

2014-15

18,320

2015-16

16,745

2016-17

16,550

Published date : 11 Sep 2018 06:23PM

Photo Stories