Skip to main content

జర్మనీ విద్యకు స్కాలర్‌షిప్స్

ప్రపంచంలోని 200 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో 12 ఆ దేశంలోనివే..పరిశోధనా విద్యలో ముందంజలో అధిక శాతం యూనివర్శిటీలు..ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ ఉచితం..విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చూ తక్కువే...! విదేశాల్లో చదవాలనుకునేవారికి చక్కటి గమ్యస్థానం..!ఆ దేశమే జర్మనీ..! ఇక్కడి వర్సిటీల్లో ఆయా కోర్సుల్లో చేరాలనుకునే వారికి తోడ్పడే స్కాలర్‌షిప్స్ గురించి తెలుసుకుందాం..!
మూడు రకాల స్కాలర్‌షిప్‌లు...
జర్మనీలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు పలు స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చులకు దోహదడపడతాయి. ఈ స్కాలర్‌షిప్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు. అవి... గవర్నమెంట్ ఫండెడ్, నాన్ గవర్నమెంట్ ఫండెడ్, యూనివర్సిటీ స్పెసిఫిక్ స్కాలర్‌షిప్స్.

గవర్నమెంట్ ఫండెడ్ :
వీటికి అవసరమైన మొత్తాన్ని ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఇందులో ప్రధానమైనవి.

ఎ)డాడ్ (డీఏఏడీ) స్కాలర్‌షిప్స్: అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ ప్రోగామ్స్ చదివే విదేశీ విద్యార్థుల కోసం ‘ది జర్మన్ అకడమిక్ సర్వీస్ ఎక్ఛ్సేంజ్ సర్వీస్ (డీఏఏడీ)’ వీటిని అందిస్తోంది.
బి) ఎరాస్మస్ ప్లస్ (+): యూరోపియన్ యూనియన్ (ఈయూ) సమకూరుస్తుంది. 100కు పైగా మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌లో ఈ స్కాలర్‌షిప్స్ అందుబాటులో ఉన్నాయి. యూరప్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులు జీవన వ్యయానికి అవసరమైన మొత్తాన్ని వీటితో పొందవచ్చు.

నాన్-గవర్నమెంట్ ఫండెడ్ :
వీటికి ప్రభుత్వం నిధులు సమకూర్చదు. ఇందులో ముఖ్యమైనవి..
ఎ) హెన్రిచ్ బోల్ స్కాలర్‌షిప్స్: వీటిని జర్మనీ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బీఎంబీఎఫ్), ఫారిన్ ఆఫీస్ మార్గదర్శకాల ప్రకారం అందిస్తారు. ఏటా రెండుసార్లు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. మొదటిసారి మార్చి 1, రెండోసారి ఆగస్ట్ 31 దరఖాస్తులకు తుదిగడువు.
బి) హమ్‌బోల్ట్ రీసెర్చ్ ఫెలోషిప్స్: పీహెచ్‌డీ పూర్తిచేసి పోస్ట్ డాక్టోరల్ స్టడీ (6-24 నెలలు) అభ్యసించేవారికి మాత్రమే వీటిని ఇస్తారు. ఈ స్కాలర్ షిప్స్‌ను అలెగ్జాండర్ వాన్ హమ్‌బోల్ట్ ఫౌండేషన్ అందిస్తుంది. ఏటా దాదాపు 500 మందికి ఇస్తారు.
సి) కొన్రడ్-అడెన్యుయర్-స్టిఫ్టుంగ్ (కేఏఎస్) స్కాలర్‌షిప్స్: మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌లో చేరే అంతర్జాతీయ విద్యార్థులకు కేఏఎస్ స్కాలర్‌షిప్స్ అందిస్తారు. అప్లైడ్ సైన్స్, టెక్నికల్ కోర్సుల విశ్వ విద్యాలయాలు, కళాశాలల్లో చేరే విదేశీ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లు.
డి) బేయర్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్: బేయర్ ఫౌండేషన్ ఐదు ఫెలోషిప్ విభాగాలుగా వేర్వేరు కోర్సుల అభ్యర్థులకు అందిస్తుంది. అందులో..

i) ఒట్టో బేయర్ స్కాలర్‌షిప్ : బయాలజీ, మాలిక్యులార్ బయాలజీ, బయో ఇంజనీరింగ్, బయోఇన్ఫర్మేటిక్స్, కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్స్, కంప్యుటేషనల్ లైఫ్ సెన్సైస్.

ii) కార్ల్ డ్యూస్‌బెర్గ్ స్కాలర్‌షిప్: హ్యూమన్ అండ్ వెటర్నరీ మెడిసిన్, మెడికల్ సైన్స్, మెడికల్ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ అండ్ హెల్త్ ఎకనమిక్స్.

iii) జెఫ్ షెల్ స్కాలర్‌షిప్ : ఆగ్రో సెన్సైస్, డిజిటల్ ఫార్మింగ్, ఆగ్రోనమీ, క్రాప్ సెన్సైస్, గ్రీన్ బయో టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్ అండ్ సస్టైనబిలిటీ.

iv) హెర్మాన్ స్ట్రెంగర్ స్కాలర్‌షిప్ : నాన్ అకడమిక్స్ ఫ్రొఫెషన్స్‌లోని అప్రెంటీసెస్, యంగ్ ప్రొఫెషనల్స్ అభ్యర్థులకు ఇస్తారు.

v) కర్ట్ హన్సెన్ స్కాలర్‌షిప్ : బయాలజీ, కెమిస్ట్రీ విభాగాల్లోని స్టూడెంట్ టీచర్స్‌కు మాస్టర్స్ డిగ్రీ స్థాయి వరకు వీటిని అందిస్తారు.

ఈ)మెరీ స్కొల్డొవ్‌స్కా-కురీ అక్షన్స్: వివిధ విభాగాల్లోని రీసెర్చర్స్‌కు మెరీ స్కొల్డొవ్‌స్కా-కురీ అక్షన్స్ (ఎంఎస్‌సీఏ) నాలుగు రకాల స్కాలర్‌షిప్స్‌ను ఇస్తోంది. ఇవి వివిధ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లోని పరిశోధకులను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతున్నాయి.
అవి..
i) రీసెర్చ్ నెట్‌వర్క్స్(ఐటీఎన్): వినూత్న ఆవిష్కరణ సంస్థలకు ఇది తోడ్పాటునిస్తుంది. దీనిని యురోపియన్ పార్టనర్‌షిప్స్ ఆఫ్ యూనివర్సిటీస్, నాన్-అకడమిక్ ఆర్గనైజేషన్స్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. డాక్టోరల్ కోర్సు ఉన్నా, లేకున్నా.. నాన్ -అకడమిక్ విభాగంలోని పరిశోధన స్కిల్స్‌ను ప్రోత్సహించే ఉద్దేశంలో మంజూరు చేస్తున్నారు.

ii) ఇండివిడ్యువల్ ఫెలోషిప్స్ (ఐఎఫ్): యూరోపియన్ యూనియన్ దేశాల్లోని అనుభవజ్ఞులైన పరిశోధకులకు ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తారు. ఇందులో రెండేళ్లకు సరిపడా జీతం, భత్యం, పరిశోధనల వ్యయం ఇస్తారు.

iii) రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ స్టాఫ్ ఎక్ఛేంజెస్(ఆర్‌ఐఎస్‌ఈ): ఇది అంతర్జాతీయ, ఇంటర్ సెక్టారల్ కోఆపరేషన్‌కు ఉద్దేశించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి నుంచి మేనేజ్‌మెంట్ స్థాయి వరకు అన్ని దశల్లోనూ విద్యార్థులకు కావల్సిన స్కాలర్‌షిప్స్ ఇస్తుంది. అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ స్టాఫ్ కూడా దీని ద్వారా లబ్ధి పొందొచ్చు.

iv) కోఫండ్ పోగ్రామ్స్: జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిశోధనలకు, కెరీర్ అభివృద్ధికి కావాల్సిన నిధులను అందిస్తుంది.

ఎఫ్) డీకేఎఫ్‌జడ్ పోస్ట్‌డాక్ ప్రోగ్రామ్: హెడిల్‌బర్గ్‌లోని ప్రఖ్యాత బయో మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అయిన జర్మన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ (డీకేఎఫ్‌జెడ్)లో పరిశోధన విద్య అభ్యసించే వారికి ఈ స్కాలర్‌షిప్స్ ఇస్తారు. ఏటా 500 మందికి పైగా వీటిని అందజేస్తారు. సెల్ బయాలజీ అండ్ ట్యూమర్ బయాలజీ, ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ జెనోమిక్స్, కేన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రివెన్షన్, ట్యూమర్ ఇమ్యునాలజీ, ఇమేజింగ్ అండ్ రేడియో ఆంకాలజీ, ఇన్‌ఫెక్షన్, ఇన్‌ఫ్లెమేషన్ అండ్ కేన్సర్, ట్రాన్స్‌లేషనల్ కేన్సర్ రీసెర్చ్ విభాగాలోని పీహెచ్‌డీ పరిశోధకులకు వీటిని ఇస్తారు.

జి)డ్యుట్చెలాండ్ స్టైపెండియం: ఆదాయం, జాతీయతకు సంబంధం లేకుండా మెరిట్ ఆధారంగా వీటిని పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో అందిస్తారు. ఇందులో స్కాలర్‌షిప్ మొత్తం 300 యూరోలు. ప్రైవేట్ భాగస్వామ్యం కింద 150 యూరోలు ఉంటుంది.

యూనివర్సిటీ స్కాలర్‌షిప్స్....
వీటిని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అందిస్తాయి. ఇందులో ముఖ్యమైనవి...
ఎ) బ్రెమెన్ ఇంటర్నేషనల్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషియల్ సెన్సైస్(బీఐజీఎస్‌ఎస్‌ఎస్): యూనివర్సిటీ ఆఫ్ బ్రెమెన్, జాకబ్స్ యూనివర్శిటీ ఇతర పరిశోధన విద్యాసంస్థలతో కలసి బీఐజీఎస్‌ఎస్‌ఎస్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్ కింద ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాయి. బీఐజీఎస్‌ఎస్‌ఎస్ నెట్‌వర్క్‌లోని ఇతర విద్యాసంస్థలు బొస్పరస్ యూనివర్శిటీ, ఈయూఐ ఫ్లోరెన్స్, ఎల్‌ఎస్‌ఈ, యూనివర్సిటీ ఆఫ్ మిలాన్, ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా, చాపెల్ హిల్, యేల్ యూనివర్సిటీ, యోన్సెయ్ యూనివర్సిటీ.

బి) ఫ్రాంక్‌ఫర్ట్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ డాక్టోరల్ ట్యూషన్ వీవర్స్: డాక్టోరల్ స్టూడెంట్స్ కోసం పది ట్యూషన్ ఫీజు మినహాయింపు స్కాలర్‌షిప్స్‌ను ఫ్రాంక్‌ఫర్ట్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ ట్యూషన్ ఫీజుతో పాటు ట్రావెల్ అలవెన్సులకు ప్రతి నెలా స్టైపెండ్ అందిస్తుంది.

సి) ఫ్రైస్ కోఫండ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్(ఎఫ్‌సీఎఫ్‌పీ) ఫర్ ఇంటర్నేషనల్ రీసెర్చర్స్: ఫ్రియెబర్గ్ యూవర్సిటీ, లీగ్ ఆఫ్ యూరోపియన్ రీసెర్చ్ యూనివర్సిటీస్ (ఎల్‌ఈఆర్‌యు) మంజూరు చేస్తాయి. ఫ్రియ్‌బర్గ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (ఎఫ్‌ఆర్‌ఐఏఎస్)లో 3-12 నెలల పరిశోధనాత్మక విద్య అభ్యసించే 25 మందికి ఈ ఫెలోషిప్స్ అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 10, 2017.

డి) హెచ్‌హెచ్‌ఎల్ ఇంటర్నేషనల్ ఎంఎస్సీ స్కాలర్‌షిప్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ రెస్పాన్సిబుల్ లీడర్‌షిప్: హెచ్‌హెచ్‌ఎల్ లీప్జిగ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్.. మాస్టర్స్, ఎంబీఏ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ విభాగాల్లోని వారికి ఈ ఫెలోషిప్స్ అందిస్తుంది. ఇందులోనే కోఫీ అన్నన్ బిజినెస్ స్కూల్ ఫౌండేషన్ (కేఏబీఎస్‌ఎఫ్), హెచ్‌హెచ్‌ఎల్ స్కాలర్‌షిప్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ రెస్పాన్సిబుల్ లీడర్‌షిప్, ఫ్యూచర్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్, హెచ్‌హెచ్‌ఎల్ ఏసియా-పసిఫిక్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ వంటివి ఉన్నాయి. పూర్తి వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ఈ) హమ్‌బోల్ట్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఫెలోషిప్స్: బెర్లిన్‌లోని హమ్‌బోల్ట్ యూనివర్సిటీ ఏటా 10-15 మంది సీనియర్ పరిశోధకులు, పోస్ట్ డాక్టోరల్ అభ్యర్థులకు ఈ స్కాలర్‌షిప్స్ ఇస్తుంది. హ్యుమానిటీస్ అండ్ సోషియల్ సెన్సైస్‌లోని చరిత్ర, ఆంత్రోపాలజీ, లా, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఏరియా స్టడీస్ విభాగాల అభ్యర్థులు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 10, 2017.
ఎఫ్) ఇంటర్నేషనల్ డాక్టోరల్ పొజిషన్స్ ఎట్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఈస్ట్ అండ్ సౌతీస్ట్ యూరోపియన్ స్టడీస్: లుడ్విగ్ మాక్సిమిలన్ యూనివర్సిటీ (మ్యునిచ్), యూనివర్సిటీ ఆఫ్ రిజెన్స్‌బర్గ్, గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఈస్ట్ అండ్ సౌతీస్ట్ యూరోపియన్ సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నాయి. మూడు విభాగాల్లో అసిస్టెంట్, పీహెచ్‌డీ స్కాలర్‌షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి. అవి.. ఒరిజిన్స్ అండ్ ఫామ్స్ ఆఫ్ సోషియల్ అండ్ పొలిటికల్ ఛేంజ్; కల్చరల్ సిస్టమ్స్; ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మైగ్రేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ నాలెడ్జ్. రీసెర్చ్ అసిస్టెంట్ పొజిషన్స్‌కు జర్మనీ పబ్లిక్ సర్వీస్ శాలరీ స్కేల్ గ్రేడ్ ఈ-3 (65శాతం) ప్రకారం వేతనం అందిస్తారు. పీహెచ్‌డీ స్కాలర్స్‌కు నెలవారీ స్టైపెండ్ ఇస్తారు. ప్రయాణ ఖర్చులు, పిల్లల సంరక్షణ వ్యయం తదితరాలను భరిస్తారు.

జి) యూనివర్సిటీ హాంబర్గ్ మెరిట్ స్కాలర్‌షిప్స్: డిగ్రీ స్థాయిలో అసమాన ప్రతిభ చూపే అంతర్జాతీయ విద్యార్థులకు, డాక్టోరల్ విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్ హాంబర్గ్ ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తుంది. పీహెచ్‌డీ విద్యార్థులకు నెలవారీ స్టైపెండ్ 650-1,000 యూరోలు ఉంటుంది.

హెచ్) ఏఐసీఈఎస్ స్కాలర్‌షిప్స్ ఆర్‌డబ్ల్యూటీహెచ్ ఆచెన్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్స్: కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ సైన్స్‌లో ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలు చేసే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆచెన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ సైన్స్(ఏఐసీఈఎస్) ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. నెలవారీ స్టైపెండ్ 2 వేల యూరోలు.
Published date : 19 Aug 2017 12:01PM

Photo Stories