Skip to main content

Maasters Telugu Short Film- అమెరికా డ్రీమ్స్‌.. ఇదీ రియాల్టీ, 'మాస్టర్స్‌' షార్ట్‌ఫిల్మ్‌పై ప్రశంసలు

Maasters Telugu Short Film

అమెరికాలో మాస్టర్స్‌ చేసే ఓ ఇండియన్‌ స్టూడెంట్‌ లైఫ్‌ స్టైల్‌ ఎలా ఉంటుంది? అత‌డు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన షార్ట్‌ ఫిలిం ‘మాస్టర్స్‌’. వంశీకృష్ణ అచ్చుత హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ లఘు చిత్రానికి యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ‘చాలా మంది ఎన్నారైలు నా షార్ట్‌ ఫిలింపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అమెరికానే కాదు..కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఫోన్‌ చేసి ఫిలిం బాగుందని మెచ్చుకుంటున్నారు.

నేను కూడా మాస్టర్స్‌ కోసం..
మాస్టర్స్‌ కోసం విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరు తమని తాము సినిమాలో చూసుకుంటున్నట్లుగా ఉందని చెప్పడం ఆనందంగా ఉంది. నేను కూడా మాస్టర్స్‌ కోసమే 21 ఏళ్ల వయసులో యూఎస్‌ వచ్చాను. నాతో పాటు నా స్నేహితుల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలతోనే ఈ లఘు చిత్రాన్ని తీర్చిదిద్దాను.

అలాంటి కామెంట్స్‌ చేస్తున్నారు
గన్‌ కల్చర్‌ని ఇందులో కవర్‌ చేశాం.  చదువు కోసమో, ఉద్యోగం కోసమో వచ్చిన విదేశీయులను ఎందుకు చంపుతున్నారు? విదేశాల్లో ఒక అమ్మాయి చనిపోతే బాధపడకపోగా, ఇండియాను వదిలి ఎందుకు వెళ్లాలి? డబ్బు కోసం తెల్లోడి బూట్లు నాకాలా? అంటూ వల్గర్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

రిచ్‌ లైఫ్‌ కోరుకోవడం తప్పా?
ఓ మధ్య తరగతికి చెందిన వాడు రిచ్‌ లైఫ్‌ని కోరుకోవడం తప్పా? తన పేరెంట్స్‌ని కార్లలో తిప్పాలని కోరుకోవడం తప్పా? ఒక ఇండియన్‌ స్టూడెంట్‌ అమెరికాలో చనిపోతే వాళ్ల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇవేమీ ఆలోచించరు, నోటికొచ్చింది మాట్లాడుతారు. 

ఎంతోమంది భార‌తీయ విద్యార్థులు విదేశాల్లో పిట్ట‌ల్లా రాలిపోతున్నా ఇప్ప‌టివ‌కు ఒక్కటంటే ఒక్క‌ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కూడా చేయ‌లేదు. ఇటువంటి ఘ‌ట‌న‌లు ఎందుకు జ‌రుగుతున్నాయి? ఎక్క‌డ జరుగుతున్నాయి? అని ఆరా తీసి వాటిపై అవ‌గాహ‌న క‌ల్పిస్తే కొన్ని ప్రాణాల‌నైనా కాపాడుకోగ‌లుగుతాం' అని ఎమోష‌న‌ల్ అయ్యాడు వంశీకృష్ణ.

 

 

Published date : 22 Feb 2024 05:29PM

Photo Stories