Skip to main content

TS Teachers, AEE & Staff nurse Protest : గురుకుల టీచ‌ర్లు , స్టాఫ్ న‌ర్స్‌లు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళ‌న.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ గురుకుల టీచర్ అభ్యర్థులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళ‌న చేపట్టారు. గురుకుల టీచర్ అభ్యర్థులు మోకాళ్లపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అలాగే తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు.
TS Teachers and Staff nurse Protest in CM Revanth Reddy Home

అలాగే మాకు ఇంత‌వ‌ర‌కు జీతాలు రావట్లేదని సీఎం ఇంటి వద్ద నర్సింగ్ స్టాఫ్ కూడా నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. గాంధీభవన్ దగ్గర ఏఈఈ అభ్యర్థులు నిరసన చేపట్టారు. డాక్యుమెంటేషన్ జరిగి నెలలు గడుస్తున్నా తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అభ్యర్థులు వాపోయారు.

☛ Telangana CM Revanth reddy : త్వ‌ర‌లోనే భారీగా టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తాం ఇలా..! ఇంకా..

మంత్రులకు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థుల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే ఇవాళ గాంధీ భవన్ దగ్గర మోకాల్ల మీద కూర్చొని ఏఈఈ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. మార్చిలో 1:2 రేషియోలో అభ్యర్థులను కమిషన్ సెలెక్ట్ చేసింది. డాక్యుమెంటేషన్ జరిగి మూడు నెలలు గడిచినా కమిషన్ అపాయింట్మెంట్ లేటర్లు ఇవ్వలేదని అభ్యర్థులు వాపోయారు.

ఇంకెప్పుడు 2 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..

అలాగే కాంగ్రెస్ ప్ర‌భుత్వ వ‌చ్చిన ఏడాదిలోనే 2 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భర్తీకి నోటిఫికేష‌న్ ఇస్తామ‌న్న విష‌యం తెల్సిందే. కానీ గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో పెడింగ్‌లో ఉన్న వివిధ ఉద్యోగాల ఫ‌లితాల‌ను మాత్ర‌మే విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చిన ఆరు నెల‌లు గ‌డిచిన విష‌యం తెల్సిందే. ఇక ఎప్ప‌డు రెండు ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చి భర్తీ చేస్తారో అని అభ్య‌ర్థులు ఆందోళ‌ల వ్య‌క్తం చేస్తున్నారు.

Published date : 12 Jun 2024 03:24PM

Photo Stories