Jobs: కొత్తగా 6 ప్రైవేటు యూనివర్సిటీలు.. 3,500 పైగా ఉద్యోగాలు
కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు అమిటీ, సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ), గురునానక్, నిప్‌మర్, ఎంఎన్‌ఆర్ యూనివర్సిటీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఫార్మా యూనివర్సిటీని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఇటీవల మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా అనేక కంపెనీలు ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొచ్చాయి. సివిల్ ఏవియేషన్ కోర్సులకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత అతిపెద్ద విమానాశ్రయం హైదరాబాదే. విమానాశ్రయంలో ఉత్తరం వైపు రన్‌వేను నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ’అని ముఖ్యమంత్రి వివరించారు.
3,500 పైగా ఉద్యోగాలు..
‘విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాలను కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా జరపాలని కేబినెట్ నిర్ణయించింది. విశ్వవిద్యాలయాలే నియామకాలు జరుపుకునే విధానం కాకుండా విద్యా శాఖ ద్వారా పారదర్శకంగా ఒకే నియామక సంస్థ ద్వారా జరుపుతాం. 3,500 పైచిలుకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను చేపడతాం..’అని తెలిపారు.