TS District Court Jobs : తెలంగాణలోని జిల్లా కోర్టుల్లో 1226 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల.. పదో తరగతి అర్హతతోనే..
ఈ మేరకు జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానం ద్వారా ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు ఇవే..
అభ్యర్థులు ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే ఈ పరీక్షకు అనర్హులని నోటిఫికేషన్‌లో స్పష్టంచేశారు.
వయోపరిమితి :
2022 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం :
నెలకు వేతనం రూ.19వేలు నుంచి రూ.58,850 వరకు జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వూ తదితర అంశాల ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 11, 2023
దరఖాస్తు చివరి తేదీ : జనవరి 31, 2023
హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ తేదీ : ఫిబ్రవరి 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
పరీక్ష తేదీ : మార్చి నెలలో..
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..
➤ ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీలు: 10
➤ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖాళీలు: 19
➤ కోర్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్ సీబీఐ కేసెస్, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు: 36
➤ సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు: 125
➤ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు: 26
➤ హనుమకొండ జిల్లాలో ఖాళీలు: 19
➤ జగిత్యాల జిల్లాలో ఖాళీలు: 32
➤ జనగామ జిల్లాలో ఖాళీలు: 13
➤ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఖాళీలు: 18
➤ జోగులాంబ గద్వాల జిల్లాలో ఖాళీలు: 25
➤ కామారెడ్డి జిల్లాలో ఖాళీలు: 14
➤ కరీంనగర్ జిల్లాలో ఖాళీలు: 12
➤ ఖమ్మం జిల్లాలో ఖాళీలు: 13
➤ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఖాళీలు: 11
➤ మహబూబాబాద్ జిల్లాలో ఖాళీలు: 13
➤ మంచిర్యాల జిల్లాలో ఖాళీలు: 14
➤ మహబూబ్ నగర్ జిల్లాలో ఖాళీలు: 33
➤ మెదక్ జిల్లాలో ఖాళీలు: 16
➤ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఖాళీలు: 92
➤ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్ జిల్లాలో ఖాళీలు: 128
➤ ములుగు జిల్లాలో ఖాళీలు: 14
➤ నాగర్ కర్నూలు జిల్లాలో ఖాళీలు: 28
➤ నల్గొండ జిల్లాలో ఖాళీలు: 55
➤ నారాయణపేట జిల్లాలో ఖాళీలు: 11
➤ నిర్మల్ జిల్లాలో ఖాళీలు: 18
➤ నిజామాబాద్ జిల్లాలో ఖాళీలు: 20
➤ పెద్దపల్లి జిల్లాలో ఖాళీలు: 41
➤ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖాళీలు: 26
➤ రంగారెడ్డి జిల్లాలో ఖాళీలు: 150
➤ సంగారెడ్డి జిల్లాలో ఖాళీలు: 30
➤ సిద్దిపేట జిల్లాలో ఖాళీలు: 25
➤ సూర్యాపేట జిల్లాలో ఖాళీలు: 38
➤ వికారాబాద్ జిల్లాలో ఖాళీలు: 27
➤ వనపర్తి జిల్లాలో ఖాళీలు: 19
➤ వరంగల్ జిల్లాలో ఖాళీలు: 21
➤ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఖాళీలు: 34
తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో 1226 ఉద్యోగాల పూర్తి వివరాలు ఇవే..