Skip to main content

Jobs: గిడ్డంగుల సంస్థలో టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ

PJTS
PJTS

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థలో టెక్నికల్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీ కోసం గురువారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించారు. వివిధ వ్యవసాయ కళాశాలలకు చెందిన 50 మంది విద్యార్థులు ఈ క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. విశ్వవిద్యాలయ విద్యార్థి వ్యవహారాల డీన్‌ డాక్టర్‌ జె.సత్యనారాయణ, రాజేంద్రనగర్‌ వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ నరేందర్‌రెడ్డి సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ జితేందర్‌రెడ్డి, టీఎస్‌డబ్ల్యూసీ జనరల్‌ మేనేజర్‌ రమణమూర్తి, మహ్మద్‌ ముజిబూర్‌ రహమాన్, రహీమ్‌ తదితరులున్నారు.

Published date : 24 Sep 2021 03:42PM