Promotion of Anganwadis: అంగన్‌వాడీలకు పదోన్నతి
Sakshi Education
జగిత్యాల: జిల్లాలోని 28 మినీ అంగన్‌వాడీ టీచర్లకు జీవో నంబరు 37 ప్రకారం పదోన్నతి కల్పించారు.
ఈ మేరకు కలెక్టర్ యాస్మిన్ బాషా జనవరి 10న వారికి పదోన్నతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీలకు పదోన్నతులతోపాటు, బాధ్యతలూ పెరిగాయని, మహిళలు, పిల్లలు పోషణ, అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, ధర్మపురి సీడీపీవో వాణిశ్రీ, సూపర్‌వైజర్లు లత, నీలిమ, శైలజ పాల్గొన్నారు.
చదవండి:
Sribotla Ramaswamy: పాఠశాల చదువు జీవితానికి పునాది
Collector Rajarshi Shah: పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం..
Published date : 12 Jan 2024 11:07AM