Skip to main content

Sribotla Ramaswamy: పాఠశాల చదువు జీవితానికి పునాది

కరీంనగర్‌కల్చరల్‌: క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణిస్తారని ప్రముఖ వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణుడు శ్రీబొట్ల రామస్వామి అన్నారు.
Sribotla Ramaswamy on student success   Schooling is the foundation of life   Sribotla Ramaswamy, expert in personality development training

జ‌నవ‌రి 10న‌ కరీంనగర్‌లోని సరస్వతీ శిశుమందిర్‌ పాఠశాల పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వికాస శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు.

చదవండి: ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ నైపుణ్యాలు

ప్రతి విద్యార్థి చదువుకునే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడని పేర్కొన్నారు. పాఠశాల చదువు జీవితానికి పునాది అని, పునాది ఎంత పటిష్టంగా ఉంటే జీవితం అంతా గొప్పగా ఉంటుందని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు.

Published date : 12 Jan 2024 11:13AM

Photo Stories