Nursing Officers Results: నర్సింగ్ ఆఫీసర్స్ ఫలితాలు విడుదల
7,094 పోస్టుల్లో 6,956 మందిని ఎంపిక చేసినట్లు మెడి కల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. జోన్ల వారీగా రిజర్వేషన్, కటాఫ్‌ల ను పొందుపరుస్తూ వెల్లడించింది. ఎంపికైన అ భ్యర్ధులకు ఈ నెల 31వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందించను న్నారు.
కొత్త ప్రభుత్వంలో మొదటి నియామకం కావడంతో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భా విస్తున్నారు. దీనిలో భాగంగానే ఎల్బీ స్టేడియంలో భారీగా కార్యక్రమం ఏర్పాటు చేసి ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలను ఇవ్వనున్నా రు. ఇప్పటికే ఎంపికైన అభ్యర్ధులందరినీ ప్రత్యేక బస్సుల్లో తీసుకురావాలని సర్కారు అన్ని జిల్లాల వైద్యాధికారులకు సూచించింది.
చదవండి: TS Government Jobs 2024 : ఈ శాఖలోని 6000 పోస్టుల భర్తీకి చర్యలు.. ఉద్యోగాల వివరాలు ఇవే..
గత ప్రభుత్వం నోటిఫికేషన్..
2022 డిసెంబర్ 30వ తేదీన 2022న 5,204 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులకు గత ప్రభుత్వం నో టిఫికేషన్ ఇచ్చి గతేడాది ఆగస్టు 2న పరీక్ష నిర్వ హించింది. 40,936 మంది అభ్యర్దులు దరఖాస్తు చేయగా, 38,674 మంది పరీక్ష రాశారు.
ప్రభు త్వం మారిన తర్వాత గత డిసెంబరు 15న ఆ నోటిఫికేషన్‌కు మరో 1,890 పోస్టులను కలిపా రు. వీటిలో డీఎంఈ పరిధిలో 5650 పోస్టులు, టీవీవీపీ పరిధిలో 757, ఎంఎన్‌జే, గురుకులాల్లో మిగతా పోస్టులను భర్తీ చేయనున్నారు.
పేస్కేల్ రూ. 36,750 – రూ. 1,06,990
నర్సింగ్ ఆఫీసర్స్‌కు పేస్కేల్ రూ. 36,750 – రూ.1,06,990 ఖరారు చేశారు. దీంతో అభ్యర్థుల నుంచి కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులకు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పాటు, ఇతరులూ దరఖాస్తు చేసుకున్నారు.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పాయింట్లు కేటాయించడంతో వారే ఎక్కువగా ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. రాత పరీక్షలో మార్కులకు గరిష్టంగా 80 పాయింట్లు ఉంటాయి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా 20 పాయింట్ల వరకు అదనంగా ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించిన వారికి ప్రతి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లోని వారికి 2 పాయింట్ల చొప్పున కేటాయించారు.
Tags
- Nursing Officers
- Nursing Officers Results
- Nurse
- Telangana News
- Staff Nurse
- Medical and Health Services Recruitment Board
- telangana cm revanth reddy
- Health Services Recruitment
- Medical Recruitment Update
- Selected Candidates
- Staff Nurse Selection List
- Nursing Officers Exam Results
- Sakshi Education Latest News