Mega Job Mela 2023 : జూలై 22వ తేదీన జాబ్‌మేళా.. నెలకు రూ.10వేల నుంచి రూ.30వేల వరకు జీతం..
ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు జూలై 17వ తేదీన (సోమవారం) కలెక్టరేట్‌లో జాబ్‌మేళాకు చెందిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.
☛ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్ పోస్ట్‌లు.. ఈ టిప్స్ ఫాలో అయితే ఒక ఉద్యోగం మీకే
విద్యార్హతను బట్టి రూ.10వేల నుంచి రూ.30వేల వరకు జీతం ఉంటుందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, డీఆర్‌ఓ కె.వినాయకం, డీఆర్‌డీఏ పీడీ బాలూనాయక్, వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ కుర్రి సాయి మార్కొండారెడ్డి, నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి కె.సంజీవరావు పాల్గొన్నారు.
225 మందికి ఉద్యోగాలు..
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో అమలాపురంలోని స్థానిక మిరియాం కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 225 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. ఈ మేళాకు 670 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. దీనిని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రారంభించారు. ఆయన, అమలాపురం ఆర్‌డీఓ వసంతరాయుడు మాట్లాడుతూ, యువతలో పలు రకాల నైపుణ్యాలను గుర్తించి, వారికి సరైన శిక్షణ ఇచ్చి, ఉపాధి మార్గాలు చూపించడం అభినందనీయమని ప్రశంసించారు.
Job Mela for Unemployed Youth: ఎలా అప్లై చేసుకోవాలి... ఉద్యోగ వివరాల కోసం ఇక్కడ చూడండి!
కళాశాలలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన స్కిల్ హబ్, ఉచిత శిక్షణ, ప్లేస్‌మెంట్స్ ప్రోగ్రామ్‌ను కూడా ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ప్రారంభించారు.శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి వసంతలక్ష్మి, ఏపీఎస్‌ఎస్‌డీసీ స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి లోక్‌మాన్, ప్రతినిధి నాగబాబు, ప్రిన్సిపాల్ నల్లా తమ్మేశ్వరరావు కూడా ప్రసంగించారు.