Jobs: గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు ఇంటర్వ్యూ
Sakshi Education
కందుకూరు రూరల్: స్థానిక టీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ సబ్జెక్టు గెస్ట్ ఫ్యాకల్టీకి ఫిబ్రవరి 7వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.రవికుమార్ ఫిబ్రవరి 1న ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి, అర్హత గత అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని ఉదయం 10 గంటలకు కళాశాలలో హాజరుకావాలన్నారు. పోస్ట్ గ్రాడ్యువేషన్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు.
చదవండి: Supreme Court Job Notification 2024: సుప్రీంకోర్టులో 90 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
బోధనానుభవం, నీట్, స్లెట్, సెట్, పీహెచ్‌డీ అర్హత గల వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. నెలకు రూ.28 వేలు గరిష్టంగా వేతనాన్ని చెల్లిస్తామని తెలియజేశారు.
Published date : 03 Feb 2024 08:45AM