Skip to main content

TREIRB: గురుకుల కొలువులకు పరీక్షలు!.. పరీక్ష తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: ఆగస్టు ఒకటి నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) వెల్లడించింది.
TREIRB
గురుకుల కొలువులకు పరీక్షలు!.. పరీక్ష తేదీలు ఇవే..

పరీక్షల వారీగా తేదీల షెడ్యూల్‌ను నేడో, రేపో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. పరీక్షలకు సరిగ్గా నెలన్నర సమయం ఉన్న నేపథ్యంలో నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్న టీఆర్‌ఈఐఆర్‌బీ, ఫలితాలపైనా కసరత్తు చేస్తోంది. ఆగస్టు నెలలో పరీక్షలు నిర్వహిస్తుండగా... నెలరోజుల వ్యవధిలో ఫలితాలను విడుదల చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీంతో సెప్టెంబర్‌లోనే గురుకుల కొలువుల ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతరం ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను కేటగిరీల వారీగా రూపొందించేందుకు వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది. 

చదవండి: TS Gurukulam Teacher Jobs: టీఎస్‌ గురుకులాల్లో 9,231 పోస్టులు.. విజయం సాధించే మార్గాలు ఇవే..

సీబీఆర్టీ పద్ధతితో వేగంగా పరీక్షలు... 

గురుకుల కొలువుల అర్హత పరీక్షలను ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించాలని తొలుత బోర్డు నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో పరీక్షలన్నీ సీబీఆర్టీ(కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌) పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పద్ధతిలో ఒక సెషన్‌లో పరీక్షలు నిర్వహించడానికి 40వేల మంది సామర్ధ్యం ఉన్న వ్యవస్థ మాత్రమే రాష్ట్రంలో అందుబాటులో ఉంది. అయితే గురుకులాల్లో 9వేల కొలువులకు 2.6లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కేటగిరీల వారీగా దరఖాస్తులను పరిశీలిస్తే దాదాపు అన్ని కేటగిరీల్లో 40వేలలోపు దరఖాస్తులు ఉండడంతో సీబీఆర్టీ విధానాన్ని అమలు చేసేందుకు మార్గం సుగమమైంది. ఈ పద్ధతిలో పరీక్షలు నిర్వహించేందుకు సంబంధిత సంస్థలతో గురుకుల బోర్డు అవగాహన కుదుర్చుకుంది. ఈ పద్ధతిలో నిర్వహణ ఖర్చు, సమయం తక్కువ కావడం గురుకుల బోర్డుకు కలిసొచ్చే అంశం. 

చదవండి: TS Gurukulam Jobs 2023 Vacancy and Eligibility : టీఎస్ గురుకులం సిల‌బ‌స్‌, బెస్ట్ బుక్స్ ఇవే..

Published date : 17 Jun 2023 03:26PM

Photo Stories