Skip to main content

Good News For Women's : మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఇక‌పై వీరికి ప్ర‌భుత్వ‌, ఇత‌ర ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇలా..!

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ ప్ర‌భుత్వం మహిళలకు శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజాంటల్‌ (సమాంతర) పద్ధతిలో 33 1/3 శాతం (33.333%) రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
women's reservation in telangana

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజాగా ఉత్తర్వులు కూడా జారీ (జీఓ.ఎంఎస్‌.3) చేశారు. 

ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు విద్యా సంస్థలు, స్థానిక సంస్థల్లో..
వీటి ప్రకారం మహిళలకు ఓపెన్‌ కాంపిటీషన్‌ (ఓసీ)తో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్విస్‌మెన్, క్రీడాకారుల కోటాలో హారిజాంటల్‌ పద్ధతి (రోస్టర్‌ పట్టికలో ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్‌ లేకుండా)లో 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో కూడా..
ఇప్పటివరకు వర్టీకల్‌ పద్ధతి (పట్టికలోని పోస్టుల్లో కొన్నిటిని ప్రత్యేకంగా మహిళలకంటూ మార్కింగ్‌ ఇచ్చేవారు)లో ఉద్యోగ నియామకాలు చేయగా.. ఇకపై ఎలాంటి మార్కింగ్‌ చేయకుండా 33 1/3శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం సూచించిన మెథడాలజీ ప్రకారం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలుకు గతంలో ఇచ్చిన జీవో నం.41/1996, జీవో నం. 56/1996 ఉత్తర్వులు రద్దు చేసింది.

☛ Happiest State in India : భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఇదే..! వీళ్ల సంతోషానికి కార‌ణం..

ఈ పద్ధతిని ప్రస్తుతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాజ్యాంగ నియామక సంస్థలు, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేకంగా జీవో జారీ చేయనుందని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 

ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం అన్ని నియామక సంస్థల‌కు..

women's reservation news in telugu

మహిళలకు హారిజాంటల్‌ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సాధారణ పరిపాలన శాఖ తరపున ఒక మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ మెమోను అన్ని నియామక సంస్థలకు పంపించారు. ఈ విషయంలో న్యాయ వివాదాలు తలెత్తకుండా మహిళా శిశు సంక్షేమశాఖ 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలు కోసం 1996లో జారీ చేసిన జీవో నం.41కు, రాష్ట్ర సబార్డినేట్‌ సర్విసు నిబంధనలు రూల్‌.22కు సవరణలు చేయాలని పేర్కొంటూ టీఎస్‌పీఎస్సీ ఫిబ్ర‌వ‌రి 8వ తేదీన‌ మహిళా శిశు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మహిళలకు రోస్టర్‌ పాయింట్‌ లేకుండా హారిజాంటల్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది.

☛ GK : తొలిసారిగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన రాష్ట్రపతి ఎవ‌రు..?

Published date : 16 Feb 2024 01:23PM

Photo Stories