Happiest State in India : భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఇదే..! వీళ్ల సంతోషానికి కారణం..

నివేదిక ప్రకారం.. 100 శాతం అక్షరాస్యత సాధించడంలో భారతదేశంలోని మిజోరాం రాష్ట్రం రెండో స్థానం దక్కించుకుంది. అంతేగాదు ఇక్కడ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్యార్థులు అభివృద్ధి చెందేలా పుష్కలమైన అవకాశాలను అందిస్తోంది.
ఈ ఆనంద సూచికను కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, ఆనందం, కోవిడ్-19 ప్రభావం, శారీరక మానసిక ఆరోగ్యంతో సహా ఆరు పారామితుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. మిజోరాంలో ఐజ్వాల్‌లోని ప్రభుత్వ మిజో హైస్కూల్(జీహెచ్‌ఎంస్) విద్యార్థి.. తన తండ్రి చిన్నతనంలో కుటుంబాన్ని విడిచిపెట్టడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతను చదువులో రాణించడం విశేషం.

అదేవిధంగా జీఎంహెచ్‌ఎస్‌లో పదోతరగతి చదువుతున్న విద్యార్థి నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ)లో చేరాలని ఆకాంక్షిస్తున్నాడు. అతని తండ్రి పాల ఫ్యాక్టరీలో పని చేస్తాడు, అతని తల్లి గృహిణి. ఆ ఇద్దరూ విద్యార్థులు తమ పాఠశాల కారణంగా తమ లక్ష్యాన్ని చేరుకుంటామనే భావంతో ఉన్నారు. అంతేగాదు మా ఉపాధ్యాయులు మాకు మంచి స్నేహితులు మేము వారితో ఏ విషయాన్నేనా పంచుకోవడానికి సందేహించం, భయపడం అని మరో విద్యార్థి చెప్పాడు. మిజోరాంలో అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వారు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి క్రమం తప్పకుండా బేటీ అవుతారని తెలిసింది.

పైగా అక్కడ చదువుల కోసం తల్లిదండ్రలు ఒత్తిడి చాలా తక్కువ. ప్రతి బిడ్డ లింగ భేదం లేకుండా ముందుగా సంపాదించడం ప్రారంభిస్తారని నివేదిక పేర్కొంది. అక్కడ ప్రజలు ఏ పనిని చిన్నదిగా భావించరు. యువకులు సాధారణంగా 16 లేదా 17 ఏళ్ల వయసు నుంచి ఉపాధి వెతుక్కుంటారు. దీంతోపాటు బాలికలు, అబ్బాయిలు అనే వివక్ష ఉండదని నివేదిక పేర్కొంది. ఇలా అనే అంశాల్లో సానూకూలత కనిపించడంతో మిజోరాం అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా నిలిచింది.