Government Medical Association: సీనియారిటీ ఆధారంగానే డీఎంహెచ్‌వో పోస్టుల భర్తీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పోస్టులను సీనియారిటీ ప్రాతిపదికన భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం కోరింది.
ఈ మేరకు జూలై 6న ప్రభుత్వ వైద్యుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లాలూ ప్రసాద్ రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కల్యాణ్ చక్రవర్తి, ప్రధాన కార్యదర్శి దీన్ దయాల్, కోశాధికారి ప్రశాంత్.. వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీని కలసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజారోగ్య విభాగంలోని వైద్యులకు ఎన్నో ఏళ్ల సర్వీసు ఉన్నా, పదోన్న తులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సీనియారిటీ ప్రకారం 33 జిల్లాల్లో పోస్టులను భర్తీ చేయాలని కోరారు.
Published date : 07 Jul 2023 03:48PM