AP Government Jobs : 823 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే..
ఇందులో 635 పోస్టులు డీహెచ్, 188 వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్నాయి. 2022 జూలై 1వ తేదీ నాటికి 42 ఏళ్లు మించకుండా ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్–సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, వికలాంగ అభ్యర్థులకు 10 ఏళ్ల చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 6వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా hmfw.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆస్పత్రుల్లో మానవ వనరుల కొరతకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 40 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. ఇందులో భాగంగానే తాజా నోటిఫికేషన్ విడుదల చేశారు.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్