Anganwadi Worker Salary Hike Update 2024 : అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవాల్సిందే.. ఇంకా..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : అంగన్‌వాడీ టీచర్లకు నెలకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు జొన్నలగడ్డ వెంకటరమణ కోరారు.
నల్లగొండలోని టీఎన్‌జీఓస్ భవన్‌లో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. సిబ్బందికి హెల్త్ కార్డులతో పాటు కమర్షియల్ సిలిండర్లను డొమెస్టిక్‌గా మార్చి ఒక్కో సెంటర్‌కు డబుల్ సిలిండర్లను ఇవ్వాలన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్, మరుగుదొడ్ల వసతి కల్పించాలన్నారు. కూరగాయల బిల్లులు పెంచాలన్నారు. ఈ సమావేశంలో అంగన్‌వాడీల అసోసియేషన్ కార్యదర్శి మజ్జిగపు సునీత, కోశాధికారి సునీత, టీన్‌జీఓస్ జిల్లా అధ్యక్షుడు ఎం.శ్రవణ్‌కుమార్, కార్యదర్శి కిరణ్‌కుమార్, కోశాధికారి జయరావు, ఆయా యూనియన్ల మురళి, దుర్గయ్య, శశికళ, అరుణ, సుధ, ఖుర్షిద్‌బేగం, విజయలక్ష్మి, రాజ్యం, కౌసర్, వెంకటరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Published date : 30 Jan 2024 09:27AM
Tags
- Anganwadi Worker Salary Hike 2024
- Anganwadi Worker Salary Hike 2024 Update News Telugu
- Telangana Anganwadi Worker Salary Hike 2024
- Anganwadi Jobs Notification 2024
- Big Good News For TS Anganwadi Workers Salary Hike
- TS Anganwadi Workers Salary Hike News Telugu
- TS Govt Increase Anganwadi Teachers And Helpers Salary Hike
- Telangana Anganwadi Teacher Salary and Anganwadi Helper Salary hiked 2024
- Telangana Anganwadi Teacher Salary 2024 and Telangana Anganwadi Helper Salary
- Telangana Anganwadi Teacher Salary and Anganwadi Helper Salary hiked
- SalaryDemand
- AnganwadiWorkers
- sakshieducation
- AnganwadiTeachers