Skip to main content

Anganwadi Jobs : భారీగా అంగన్వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. అలాగే జీతాలు పెంపునకు కూడా..: మంత్రి సీతక్క

సాక్షి ఎడ్యుకేష‌న్ :తెలంగాణ‌లో త్వ‌ర‌లోనే 14000 పైగా అంగన్వాడీ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌ని..పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క వెల్ల‌డించారు.
Telangana Anganwadi Careers   Latest Anganwadi Vacancies Announcement   telangana minister seethakka    Telangana Anganwadi Recruitment Notification

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, తొర్రూరు మండలాల్లో డిసెంబ‌ర్ 26వ తేదీన (మంగళవారం) మంత్రి పర్యటించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడీలు, అప్‌గ్రేడ్ అయినా అంగన్వాడీలలో కలిపి దాదాపు 14 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయ‌ని మంత్రి తెలిపారు. వీటికి సంబంధించిన జిల్లా వారీగా నోటిఫికేషన్‌లు త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల భవనాలకు మరమ్మతులుంటే నిధులు మంజూరు చేస్తామన్నారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాలు పెంపునకు కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క వెల్లడించారు.

minister seethakka anganwadi jobs news

☛ Telangana Mega DSc Notification : త్వ‌ర‌లోనే మెగా డీఎస్సీ.. 20000 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చేలా..

ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్‌ ఉంటే.. మినీకేంద్రాల్లో మాత్రం ఒక టీచర్‌ ఉంటారు. ఇక్కడ హెల్పర్‌ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్‌గ్రేడ్‌తో అక్కడ హెల్పర్‌ పోస్టు అనివార్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు అప్‌గ్రేడ్‌ వివరాలు పంపింది. ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్ల నియామకం చేపట్టొచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్‌ పాలసీతో దాదాపు రెండున్నర వేలమంది టీచర్లు పదవీ విరమణ పొందాల్సి ఉంది. ఈ క్రమంలో అన్ని రకాల్లో కలిపి నాలుగువేల వరకు పోస్టులు ఖాళీగా ఉంటాయి. అయితే కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నోటిఫికేషన్లు జారీ చేసి.. భర్తీ ప్రక్రియ ప్రారంభించింది.అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.

☛ TS Medical Jobs : వైద్య ఆరోగ్య శాఖలో 7,356 పోస్టులు.. భర్తీ ఇంకెప్పుడు..?
మినీ కేంద్రాల అప్‌గ్రెడేషన్‌తో హెల్పర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, అంతకుముందే అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు.

Published date : 27 Dec 2023 01:36PM

Photo Stories