Jobs: 8 ఏళ్లు.. 17 లక్షల ఉద్యోగాలు
ఇటీవలి కాలంలో గ్రూప్–1 మొదలు అన్ని రకాల ఉద్యోగాలకు ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటనలు జారీ చేస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇటీవల దాదాపు 60 వేల ఉద్యోగాలకు తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. మరి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పన ఎలా ఉంది? తెలంగాణ ఏర్పాటయిన తర్వాత ఏ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి? ఈ ప్రశ్నలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే–2023 సమాధానం ఇచ్చింది.
చదవండి: TSSPDCL Recruitment 2023 : టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1601 పోస్టులు
రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణ ఏర్పాటయిన ఏడాదిని మినహాయిస్తే 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2022–23 వరకు అంటే 8 ఏళ్లలో ప్రైవేటు రంగంలో వచ్చిన ఉద్యోగాల సంఖ్య 17.2 లక్షలపైనే. టీఎస్–ఐపాస్ కింద రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతులు పొందిన సంస్థలు, కంపెనీల్లో ఈ మేరకు ఉపాధి అవకాశాలు లభించాయి.
చదవండి: TSPSC Group 3 Notification: 1365 గ్రూప్-3 పోస్టులు... పూర్తి వివరాలు ఇవే..
వరుసగా నాలుగేళ్లు...
గత 8 ఏళ్లలో ప్రైవేటు రంగంలో లభించిన ఉద్యోగావకాశాలను పరిశీలిస్తే రియల్ ఎస్టేట్, ఐటీ భవనాలు, పారిశ్రామిక పార్కుల్లోనే యువతకు ఎక్కువగా ఉపాధి లభించిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 9.5 లక్షలకుపైగా ఉద్యోగాలు లభించాయి. ఆ తర్వాత ఫార్మా, కెమికల్ రంగంలో, వరుసగా ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, టెక్స్‌టైల్స్ రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి. ఈ ప్రధాన రంగాలు కాకుండా మిగిలిన రంగాల్లో కలిపి 3.5 లక్షల ఉద్యోగాల వరకు వచ్చాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
చదవండి: TSPSC Group 2 Notification: టీఎస్‌పీఎస్సీలో 783 గ్రూప్–2 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 75 వేలకుపైగా, ఫార్మాలో 1.2 లక్షలు, ఇంజనీరింగ్‌లో 60 వేల మంది వరకు ఉపాధి కలిగింది. సంవత్సరాలవారీగా పరిశీలిస్తే 2017–18, 2018–19, 2019–20లో 12 లక్షల మందికిపైగా ఉపాధి కల్పన జరిగింది. 2017–18లో 2,74,963, 2018–19లో 5,99,933, 2019–20లో 3,15,607 ఉద్యోగాలు లభించాయని, టీఎస్–ఐపాస్ ద్వారా ఈ ప్రధాన రంగాల్లో గత 8 ఏళ్లలో దాదాపు రూ. 2.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చినట్లు ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడించాయి.
చదవండి: Telangana Job notification: 5204 స్టాఫ్ నర్సు పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ప్రైవేటు రంగాల్లో గత ఎనిమిదేళ్లలో ఉపాధి:..
రంగం |
2015–16 |
2016–17 |
2017–18 |
2018–19 |
2019–20 |
2020–21 |
2021–22 |
2022–23 |
రియల్ ఎస్టేట్, పారిశ్రామిక పార్కులు, ఐటీ భవనాలు |
22,150 |
42,236 |
1,81,520 |
3,31,795 |
2,46,982 |
98,958 |
214 |
6,436 |
టెక్స్‌టైల్స్ |
631 |
1,786 |
2,051 |
1,89,594 |
3,634 |
3,963 |
2,418 |
1,217 |
ఫార్మా, కెమికల్స్ |
18,881 |
7,864 |
13,105 |
13,008 |
9,794 |
14,215 |
37,403 |
11,019 |
ఫుడ్ ప్రాసెసింగ్ |
12,947 |
5,381 |
9,660 |
12,548 |
8,735 |
10,376 |
11,435 |
7,567 |
ఇంజనీరింగ్ |
4,618 |
5,547 |
12,452 |
11,315 |
12,108 |
8,148 |
12,106 |
8,528 |
ఇతర రంగాలు |
35,369 |
35,872 |
56,175 |
41,673 |
34,354 |
27,516 |
37,902 |
38,141 |
మొత్తం |
94,396 |
98,666 |
2,74,963 |
5,99,933 |
3,15,607 |
1,63,176 |
1,01,478 |
72,908 |
గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, కంపెనీల్లోకి పెట్టుబడులు
సంవత్సరం |
పెట్టుబడులు (రూ. కోట్లలో) |
2015–16 |
28,979 |
2016–17 |
34,236 |
2017–18 |
58,278 |
2018–19 |
34,508 |
2019–20 |
40,521 |
2020–21 |
16,094 |
2021–22 |
18,916 |
2022–23 |
20,237 |
మొత్తం |
2,51,769 |