Skip to main content

Success Story : అమ్మా నాకు ప్ర‌భుత్వ ఉద్యోగం వచ్చింది .. నాక్కూడా వ‌చ్చిందిరా.. చివ‌రి ప్ర‌య‌త్నంలో..

కేరళలో తల్లి, కొడుకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాశారు. ఫలితాలు వచ్చాయి. కొడుక్కి ఉద్యోగం వచ్చింది.‘అమ్మా.. నాకు ఉద్యోగం వచ్చింది’ అన్నాడు తల్లి దగ్గరకు వెళ్లి. ‘నాక్కూడా బాబూ’ అని జవాబు చెప్పిందా తల్లి.
తల్లి బిందుతో వివేక్‌
తల్లి బిందుతో వివేక్‌

ఇద్దరూ ఒకేసారి గవర్నమెంట్‌ ఉద్యోగులు అయ్యారు. వారిని ఉత్సాహపరిచిన తండ్రి ఆనందంతో కళ్లు తుడుచుకున్నాడు.

Success Story: ఓకే సారి గ్రూప్‌-2కు తండ్రీ కొడుకులు సెలక్ట్‌.. వీరి స‌క్సెస్ సిక్రెట్ చూస్తే..

ఒక సామాన్యమైన ఇంటిలో హఠాత్తుగా రెండు గవర్నమెంట్‌ ఉద్యోగాలు వచ్చేసరికి ఈ సంబరం మనదే అన్నట్టుగా ఊరు ఉంది. దానికి కారణం మొన్న ఆగస్టు 3న కేరళలో ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మలప్పురంలో అరిక్కోడ్‌ అనే ఉళ్లోని తల్లీకొడుకులు న్యూస్‌మేకర్స్‌గా నిలిచారు. తల్లి బిందు ‘లాస్ట్‌ గ్రేడ్‌ సర్వెంట్స్‌’ (ఎల్‌.జి.ఎస్‌.) విభాగంలో 92వ ర్యాంక్‌ సాధిస్తే కొడుకు వివేక్‌ ‘లోయర్‌ డివిజినల్‌ క్లర్క్‌’ (ఎల్‌.డి.సి.) విభాగంలో 38వ ర్యాంకు సాధించాడు.

Inspiring Success Story: ఆ రైతు ఇంట‌ ఐదుగురు అక్కాచెల్లెళ్లు.. అందరూ కలెక్టర్లే.. కానీ..

తల్లి వయసు 42. కొడుకు వయసు 24.. కానీ

Mother and Son From Kerala Qualify Public Service Commission


కేర‌ళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు 40 ఏళ్లు పరిమితిగా ఉన్నా కొన్ని వర్గాలకు 42 ఏళ్లు మరికొన్ని వర్గాలకు 46 ఏళ్ల వరకూ మినహాయింపు ఉంది. తన సామాజికవర్గాన్ని బట్టి పరీక్ష రాయడానికి అర్హత ఉన్న బిందు 42 ఏళ్ల వయసులో ఈ ఉద్యోగం సాధించింది. ఈసారి కాకపోతే ఇంకేముంది.. జాతీయస్థాయిలో ఇది విశేష వార్తగా మారింది.

చివ‌రి ప్ర‌య‌త్నంలో..
బిందు చాలా కాలంగా అంగన్‌వాడి టీచర్‌గా పని చేస్తూ ఉంది. ఆ కాంట్రాక్ట్‌ ఉద్యోగంతో ఆమెకు సంతృప్తి లేదు. ఎప్పటికైనా గవర్నమెంట్‌ ఉద్యోగం సాధించాలి అనుకునేది. కొడుకు వివేక్‌ పదో క్లాసుకు వచ్చినప్పటి నుంచి ఆమె పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్‌ అవుతూ ఉంది. అంతే కాదు కొడుకుతో కూడా నువ్వు గవర్మెంట్‌ ఉద్యోగం సాధించాలిరా అని తరచూ చెప్పేది. చిన్నప్పటి నుంచి అతని చేత పత్రికలు చదివించేది. కొడుకు డిగ్రీ అయ్యాక అతనూ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవడం మొదలెట్టాడు. బిందు పట్టుదల చూసి ఆమె భర్త పూర్తిగా మద్దతు పలికాడు. కోచింగ్‌లో చేరండి అని చేర్పించాడు. ఇంతకు మునుపు చేసిన అటెంప్ట్స్‌ ఫలించలేదు. ఈసారి బిందుకు లాస్ట్‌ చాన్స్‌. ఈసారి మిస్సయితే ఇక ఎగ్జామ్‌ రాసే వయసు ఆమె వర్గానికి సంబంధించి దాటేస్తుంది. ఎలాగైనా సాధించాలి అనుకుందామె.

Government Jobs Family: వీరి ఇంట అందరికి ప్రభుత్వ కొలువులే..!

కోచింగ్‌ సెంటర్‌లో..
బిందు, వివేక్‌ ఇద్దరూ ఒకే కోచింగ్‌ సెంటర్‌లో చేరారు. కలిసి వెళ్లి కోచింగ్‌ తీసుకుని వచ్చేవారు. ఆ తర్వాత ఎవరికి వారు ప్రిపేర్‌ అయ్యేవారు. ‘మేము మా గదుల్లోకి వెళ్లి చదువుకునేవాళ్లం. మధ్యలో మాత్రం డౌట్స్‌ వస్తే ఒకరినొకరం అడిగేవాళ్లం. నోట్సులు ఎక్స్ఛేంజ్‌ చేసుకునే వాళ్లం’ అన్నాడు వివేక్‌.మా సంకల్పం వృధా కాలేదు. ‘ఉద్యోగం వచ్చిందమ్మా’ అని కొడుకు పరిగెత్తుకుని వెళితే ‘నాక్కూడారా’ అని నవ్విందామె.

తాను తల్లితో కలిసి చదువుకునే సమయంలో..
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తనను స్నేహితులు, శిక్షణ కేంద్రంలోని గురువులు, కుమారుడు ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. తాను తల్లితో కలిసి చదువుకునే సమయంలో ఇద్దరం వివిధ అంశాలపై చర్చించుకునే వారమని బిందు కుమారుడు తెలిపారు. నేను ఎక్కువగా ఒంటరిగా చదువుకోవాలని భావించేవాడిని. మా అమ్మ అస్తమానూ చదివేది కాదు. అంగన్‌వాడీ పనులు ముగిశాకే చదువుకునేది.

UPSC Civils Results 2022: ప‌రీక్ష రాయలేని స్మరణ్‌ను.. అమ్మ గెలిపించిదిలా.. గంటకు 40 పేజీలు..

నా మాత్రం లక్ష‍్యం ఇదే..

KPSC


రెండు సార్లు ఎల్‌జీఎస్‌, ఒకసారి ఎల్‌డీసీ పరీక్ష రాసినా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. నాలుగో సారి విజయాన్ని అందుకున్నారు. అయితే.. తన లక్ష‍్యం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పరీక్ష అని.. ఎల్‌జీఎస్‌ బోనస్‌ అని పేర్కొన్నారు బిందు. గత 10 ఏళ్లుగా అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

UPSC 2021 Civils Ranker: ఈ ఆప‌రేష‌న్ వ‌ల్లే ఉద్యోగం కొల్పోయా.. నాన్న చెప్పిన ఆ మాట‌లే ర్యాంక్ కొట్టేలా చేశాయ్‌..

Published date : 11 Aug 2022 01:58PM

Photo Stories