MD Shabina: ఏకకాలంలో మూడు ఉద్యోగాలకు ఎంపిక
Sakshi Education
కాటారం: కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన ఎండీ షబీనాను ఏకకాలంలో మూడు ఉద్యోగాలు వరించాయి.
![Three jobs at once](/sites/default/files/images/2024/03/02/01ktm004-330111mr-1709381235.jpg)
ఫిబ్రవరి 29న వెలువడిన గురుకులం జేఎల్ ఫలితాల్లో ఎంపికవగా మార్చి 1న వెలువడిన టీజీటీ ఫలితాలు, కొన్ని రోజుల క్రితం వచ్చిన పీజీటీ ఫలితాల్లో సైతం ఉద్యోగాన్ని చేజిక్కించుకుంది. దీంతో షబీనా ఒకే క్రమంలో మూడు ఉద్యోగాలను సాధించింది.
చదవండి: Degree Lecturer Results: కాలు కోల్పోయినప్పటికీ ఆత్మస్థైర్యంతో.. ప్రథమ స్థానం కైవసం చేసుకున్న గణేశ్
చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తితో షబీనా ఎంఏ, బీఎడ్ పూర్తిచేసింది. తన విద్యాభ్యాసంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ వచ్చిన షబీనా పట్టుదలతో చదివి ఏకకాలంలో మూడు ఉద్యోగాలను కైవసం చేసుకొంది. వివాహిత అయినప్పటికీ ఉద్యోగ సాధనలో తీవ్రంగా కష్టపడి ముందుకెళ్లింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
Published date : 02 Mar 2024 05:37PM