Sandhya: టీఎస్‌ఎస్ ఉద్యోగి సస్పెన్షన్.. కేసీఆర్ ప్రచార సభలో ఇలా చేసినందుకు
Sakshi Education
హన్మకొండ అర్బన్: ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగి కొయ్యడ సంధ్యను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు.
అక్టోబర్ 27న వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి భట్టుపల్లిలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. అందులో వేదికపై సంధ్య పాటలు పాడారని ఫిర్యాదు అందడంతో విచారణ చేసిన అధికారులు ఆ నివేదిక ఆధారంగా సంధ్యను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
Published date : 03 Nov 2023 01:39PM