Department of Revenue: వీఆర్‌ఏల కోసం సూపర్‌న్యూమరీ పోస్టులు!
అందులో భాగంగా జిల్లాకు 604 పోస్టులు మంజూరు చేసింది. విద్యార్హతల ఆధారంగా రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల, మిషన్ భగీరథ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, చైన్‌మన్, హెల్పర్, లష్కర్ వంటి పోస్టులలో సర్దుబాటు చేయనుంది.
చదవండి: Telangana Jobs 2023: 156 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
జిల్లాలో 1,429 మంది వీఆర్‌ఏలు..
భూస్వామ్య వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్(వీఆర్‌ఏ) వ్యవస్థను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నీరటి, మస్కూరు, లష్కర్ తదితర పేర్లతో పిలవబడుతున్న వీఆర్‌ఏలను సూపర్ న్యూమరీ పోస్టుల్లో రెగ్యులరైజ్ చేస్తామని సీఎం పేర్కొన్నారు.
ఇందులో భాగంగా ప్రభుత్వం సూపర్ న్యూమరీ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాలో 1,429 మంది వీఆర్‌ఏలు పని చేస్తుండగా ప్రస్తుతం 604 పోస్టులు మంజూరయ్యాయి. ఇంకా 8 వందల పైచిలుకు పోస్టులు మంజూరు కావాల్సి ఉంది.
చదవండి: Telangana Jobs 2023: తెలంగాణలో 1520 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
విద్యార్హతల ఆధారంగా..
రెవెన్యూ వ్యవస్థలో గ్రామ స్థాయిలో వీఆర్వోల తర్వాత వీఆర్‌ఏలే కీలకంగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొదట వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి.. వారిని ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో సర్దుబాటు చేసింది. ఇప్పుడు వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసిన సర్కారు.. వారి కోసం వివిధ శాఖల్లో సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించింది. విద్యార్హతల ఆధారంగా వీఆర్‌ఏలను ఆయా శాఖల్లోని పోస్టుల్లో సర్దుబాటు చేయనుంది.