MPHW: ఎంపీహెచ్‌డబ్ల్యూ పరీక్షల షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: Multipurpose Health Worker(MPHW) ఫిమేల్/ఏఎన్‌ఎం కోర్సు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నవంబర్ 21న విడుదల చేసింది.
డిసెంబర్ 19 నుంచి 22వ తేదీ వరకు థియరీ పరీక్షలు, 23, 24 తేదీల్లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్టు పేర్కొంది. రెండేళ్ల కాల వ్యవధి ఉండే ఈ కోర్సు చదువుతోన్న విద్యార్థులు వార్షిక పరీక్షల రుసుమును ఏడాదికి రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. cfw.ap.nic.in వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూల్, రుసుము చెల్లింపు ఇతర వివరాలు అందుబాటులో ఉంచారు.
చదవండి:
AP High Court Recruitment 2022: ఏపీ హైకోర్టులో 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Published date : 22 Nov 2022 03:22PM