NOA: ‘నర్సింగ్ కాలేజీల్లోని పోస్టులు భర్తీ చేయాలి’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని నర్సింగ్ కాలేజీల్లో ఉన్న పోస్టులను భర్తీ చేసేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్(టీజేఏసీ) కోరింది.
ఈ మేరకు డిసెంబర్ 8న ఆ సంఘం అధ్యక్షురాలు సుజాత రాథోడ్ తదితరులు టీజేఏసీ మాజీ చైర్మన్ కోదండరాంను కలిసి వినతిపత్రం సమర్పించారు.
చదవండి: Free training for nurses: నర్సులకు ఉచిత శిక్షణ
నర్సింగ్ అధికారులకు సకాలంలో ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో 5,204 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టుల ఫలితాలను త్వరగా విడుదల చేయాలని, 317 జీవో ద్వారా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, నర్సింగ్ కౌన్సిల్ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
Published date : 11 Dec 2023 12:19PM