Skip to main content

TREI-RB: ‘గురుకుల’ అభ్యర్థులకు ఆప్షన్‌ చాన్స్‌!

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల అర్హత పరీక్షలకు హాజరైన అభ్యర్థుల నుంచి తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టిఆర్‌ఈఐఆర్‌బీ) సొసైటీ, జోనల్‌ ప్రాధాన్యతలను స్వీకరిస్తోంది.
TREI-RB, Gurukula Eligibility Tests,Candidate Preferences,Telangana ,Society and Zonal Preferences
‘గురుకుల’ అభ్యర్థులకు ఆప్షన్‌ చాన్స్‌!

 వెబ్‌సైట్‌ ద్వారా ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఇచ్చే ఆప్షన్లు తుది అవకాశంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు గురుకుల బోర్డు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మల్లయ్య బట్టు సెప్టెంబ‌ర్ 20న‌ ప్రకటన విడుదల చేశారు. 

చదవండి: Guest Lecturers: అతిథి లెక్చరర్ల నియామకానికి ఇంటర్వ్యూలు

ఒక్కసారే అవకాశం... 

గురుకుల బోర్డు నిర్దేశించిన ప్రకారం అర్హత పరీక్షలు రాసిన అభ్యర్థులు మాత్రమే ఆప్షన్ల సమర్పణకు అవకాశం ఉంటుంది. బోర్డు నిర్దేశించిన తేదీల్లో ఆయా పోస్టులకు మాజరైన అభ్యర్థులు ముందుగా సొసైటీ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సమర్పించే సొసైటీ ఆప్షన్ల వారీగా ప్రాధాన్యత ప్రకారం ఆయా సొసైటీల్లో పోస్టింగ్‌ ఇస్తారు. అదేవిధంగా జోనల్‌ ప్రాధాన్యతలకు కూ డా ఆప్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

చదవండి: Inter Admissions: గురుకులంపై గురి... ఏయే సంస్థల్లో ఎంత మంది ఫస్టియర్‌ విద్యార్థులు చేరారంటే?

ప్రాధాన్యత క్రమంలో జోన్ల ఎంపికకు అనుగుణంగా అభ్యర్థులకు ఆయా జోన్లలో పోస్టింగ్‌ ఇస్తారు. సొసైటీలు, జోన్ల ఆప్షన్ల ఎంపికకు కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. ఒకసారి ఎంపిక చేసుకున్న తర్వాత వాటి సవరణకు ఎలాంటి అవకాశం ఉండదని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. ఈక్రమంలో అత్యంత జాగ్రత్తగా ఆప్షన్లు సమర్పించాలని బోర్డు ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ సూచించారు. 

ఆప్షన్‌ తేదీ

పోస్టు

సెప్టెంబర్‌ 21 నుంచి 30 వరకు

ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌

అక్టోబర్‌ 3 నుంచి 9 వరకు

పాఠశాలల్లోని లైబ్రేరియన్, ఫిజికల్‌ డైరెక్టర్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్లు

Published date : 21 Sep 2023 11:26AM

Photo Stories