Skip to main content

Inter Admissions: గురుకులంపై గురి... ఏయే సంస్థల్లో ఎంత మంది ఫస్టియర్‌ విద్యార్థులు చేరారంటే?

సాక్షి, హైదరాబాద్‌: గురుకులంలో సీటొచ్చిందా... సరేసరి. లేకుంటే ప్రైవేటు కాలేజీనే బెస్ట్‌ అంటున్నారు ఇంటర్‌ విద్యార్థులు.
Inter Admissions
గురుకులంపై గురి... ఏయే సంస్థల్లో ఎంత మంది ఫస్టియర్‌ విద్యార్థులు చేరారంటే?

 2023–24 ప్రవేశాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. ఈ ఏడాది 4,92,873 మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 83,177 మంది చేరగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, మోడల్‌ స్కూల్స్, కస్తూర్బా బాలికల విద్యాలయాల్లో 98,536 మంది చేరారు. ఇక రాష్ట్రంలోని 1,285 ప్రైవేటు కాలేజీల్లో ఏకంగా 3,11,160 మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్లు తీసుకున్నారు.

ఈ లెక్క గమనిస్తే సాధారణ ప్రభుత్వ కాలేజీల కన్నా, గురుకులాల్లో చేరేందుకే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కేజీబీవీలు, గురుకులాల్లో ప్రత్యేక హాస్టళ్లు ఉండటం, విద్యాబోధనలో ప్రమాణాలు పాటించడం వల్ల మంచి ఫలితాలొస్తున్నాయని, అందుకే గురుకులాలకు తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యతనిస్తున్నారని అధికారులు అంటున్నారు. గురుకులాల తర్వాత ప్రైవేటు కళాశాలలవైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. 

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

గతేడాది కంటే ఇంటర్‌ ప్రవేశాలు తక్కువే 

నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్‌లో చేరిన వారి సంఖ్య తక్కువే. 2022–23లో రాష్ట్ర­వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 4,98,699 మంది ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందారు. ఈ ఏడాది 4,92,873 మంది విద్యార్థు­లు ఇంటర్‌లో చేరారు. అంటే, ఈ సంవత్సరం 5,826 మంది తగ్గిపోయారు. టెన్త్‌లో ఉత్తీర్ణత తగ్గడం దీనికి ఒక కారణమైతే, పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు రావడంతో కొంతమంది అటు వైపు మొగ్గు చూపారు. 

వీటిల్లో ఏయే సంస్థల్లో ఎంత మంది ఫస్టియర్‌ విద్యార్థులు చేరారంటే? 

యాజమాన్యం

కాలేజీల సంఖ్య

2022–23 ప్రవేశాలు

2023–24 ప్రవేశాలు

బీసీ వెల్ఫేర్‌

260

8,677

14,077

కేంద్ర ప్రభుత్వ కాలేజీలు

1

152

160

కాంపోజిట్‌ కాలేజీలు

1

87

90

కో–ఆపరేటివ్‌ కాలేజీలు

14

1,948

1,673

ప్రభుత్వ కాలేజీలు

408

89,922

83,177

ఇన్సెంటివ్‌ కాలేజీలు

9

1,404

1,309

కేజీబీవీలు

279

11,881

13,312

మోడల్‌ స్కూల్స్‌

193

19,406

17,898

ఎయిడెడ్‌

37

6,149

5,646

ప్రైవేటు కాలేజీలు

1,285

3,16,495

3,11,160

సోషల్‌ వెల్ఫేర్‌

237

15,385

16,102

టీఎంఆర్‌జేసీ

204

8,757

10,506

ట్రైబల్‌ వెల్ఫేర్‌

122

8,255

8,416

గవర్నమెంట్‌ స్పోర్ట్స్‌

1

45

33

టీఎస్‌ఆర్‌జేసీ

35

2,581

2,560

టీఎస్‌ఆర్టీసీ

1

56

33

వొకేషనల్‌

91

7,499

6,721

మొత్తం

3,178

4,98,699

4,92,873

ఇంటరే కీలకం.. 

టెన్త్‌ వరకూ విద్యాభ్యాసం ఎలా ఉన్నా.. ఇంటర్‌ విద్యను కీలకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులూ భావిస్తున్నారు. ఇంటర్‌తో పాటే జేఈఈ, నీట్, ఎంసెట్‌ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వాలని భావిస్తుంటారు. ఈ కారణంగా ఇంటర్‌ మొదటి సంవత్సరం నుంచి అకడమిక్‌ విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన తర్ఫీదు తీసుకుంటున్నారు.

ఇంటి వద్ద నుంచి కాలేజీకి వెళ్లి రావడం వల్ల మంచి ఫలితాలు రావని తల్లిదండ్రులు భావిస్తున్నారు. హాస్టల్‌ వసతి ఉన్న చోటే పిల్లలను చదివించాలనే ఆలోచన కొన్నేళ్లుగా పెరిగింది. ప్రభుత్వ గురుకులాల్లో సీట్లు వస్తే సరి... లేకుంటే వ్యయ ప్రయాసలు భరించైనా హాస్టల్‌ వసతి ఉన్న ప్రైవేటు కాలేజీల్లో చదువు చెప్పిం­చేందుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు 3,178 ఉన్నాయి. 

Published date : 08 Sep 2023 11:56AM

Photo Stories