Teachers Unions: పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని పిలుపు
ఇందులో భాగంగా పనిచేసే కార్యాలయాల్లోనే నల్లబ్యాడ్జీలు ధరించి, విధులు హాజరు కావాలని, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, భరోసా లేని సీపీఎస్ రద్దు తదితర డిమాండ్లతో ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటానికి సన్నద్ధమవుతున్నారు.
యూఎస్పీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సెప్టెంబర్ 1న నిర్వహించే మహాధర్నాకు తరలివెళ్లనున్నారు. 4న కలెక్టరేట్ల ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 వేల మందికి పైగా సీపీఎస్‌లో కొనసాగుతున్నారు.
చదవండి: Central and State Employees: పాత పెన్షన్ విధానానే అమలు చేయాలి
వివిధ సంఘాల నాయకుల మద్దతు
సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ చేపట్టే నిరసనలకు యూఎస్పీసీ, ఎస్టీయూ, టీఆర్‌టీఎఫ్, జాక్టో సంఘాల నాయకులు వై.అశోక్‌కుమార్, కె.లక్ష్మారెడ్డి, మాడుగుల రాములు, జి.శ్రీధర్, నారాయణరెడ్డి, ఎల్లయ్య, సురేశ్, పెంటయ్య, ముల్కల కుమార్, పోరెడ్ది దామోదర్‌రెడ్డి, వై.ఉమారాణి, ఎం.రాజయ్య, జావిద్, చంద్రశేఖర్, కట్టా రవీంద్రచారి, పిన్నింటి తిరుపతిరావు, కొడిముంజ శంకర్, నల్లగొండ అంజయ్య, గంగాధర్, ముత్తినేని శ్రీనివాస్, రాజ్‌కుమార్, నందికొండ విద్యాసాగర్, అశోక్‌రావు తదితరులు మద్దతు తెలిపారు.