ప్రభుత్వ ఉద్యోగంలో ఒకేసారి చేరనున్న తల్లి, కొడుకు
Sakshi Education
పదో తరగతి చదివే కొడుకును వెన్నంటి ప్రోత్సహించేందుకు ఆ తల్లి కూడా మళ్లీ చదువు కొనసాగించింది.
కొడుకుతోపాటే పోటీ పరీక్షలకు ప్రిపేరైంది. వారి శ్రమ ఫలించింది. తొమ్మిదేళ్ల తర్వాత ఆ తల్లి, కొడుకు Kerala Public Service Commission పరీక్షల్లో పాసై ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరబోతున్నారు. మలప్పురానికి చెందిన బిందు(42) అనే అంగన్‌వాడీ పదో తరగతి చదివే తన కొడుకును దగ్గరుండి చదివిస్తూ ఉండేవారు. అలా, ఆమెకు కూడా చదువుకోవాలన్న కోరిక కలిగింది. తల్లి, కొడుకు పరీక్షలకు సంబంధించిన అంశాలపై తరచూ చర్చించుకుంటూ ఉండేవారు. లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్(ఎల్‌జీఎస్)పరీక్షను మూడు సార్లు రాశారు. నాలుగో ప్రయత్నంలో బిందు 92వ ర్యాంకు సాధించారు. ఆమె కుమారుడు(24) లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‌డీసీ)పరీక్షలో 38వ ర్యాంకు సాధించాడు. అయితే, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అవ్వడమే తన లక్ష్యమని అంటున్నారు బిందు.
చదవండి:
Published date : 09 Aug 2022 01:43PM