Skip to main content

Inspiring Story: స్టెనో నుంచి న్యాయమూర్తిగా.. ఆమె స‌క్సెస్ జర్నీ ఇలా..

సాక్షి,విశాఖ లీగల్‌: నగరంలోని 7వ అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో స్టెనోగా పనిచేస్తున్న సాయి సుధ న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.
సాయి సుధ
Success Story

విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన ఆమె హైస్కూలు విద్యను తాటిపూడి బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలలో పూర్తి చేశారు. ఎన్‌వీపీ న్యాయ కాలేజీలో న్యాయశాస్తంలో పట్టా తీసుకున్నారు.

నా విజయం వెనుక వీరే.. 
అనంతరం కోర్టులో స్టెనోగా విధుల్లో చేరారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తి పరీక్షల్లో సాయి సుధ ప్రతిభ చాటారు. తన విజయం వెనుక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఉన్నారని ఆమె చెప్పారు. ఆమె న్యాయమూర్తిగా ఎంపిక కావడం పట్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, ఇతర న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయవాది గొలగాని అప్పారావు, సీనియర్‌ న్యాయవాది గోలి శ్రీనివాసరావు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఎస్‌.కృష్ణమోహన్, రాష్ట్ర ఉపాద్యక్షుడు కె.రామజోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు.

Published date : 20 Apr 2022 06:42PM

Photo Stories