Skip to main content

TREIRB: గిరిజన కొలువుల్లో.. మహిళకు పట్టం!

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో కొలువుల జాతరతో మహిళలకే ఎక్కువ లబ్ధి కలగనుంది. ఏప్రిల్‌ 5వ తేదీన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) ఒకేసారి 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది.
TREIRB
గిరిజన కొలువుల్లో.. మహిళకు పట్టం!

గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్‌ కాలేజీలు, గురుకుల డిగ్రీ కాలేజీల్లో 9,231 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనుంది. తొలుత వెబ్‌నోట్‌లను విడుదల చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ... ప్రస్తుతం పూర్తిస్థాయి నోటిఫికేషన్లు అందుబాటులోకి తెస్తోంది. తాజాగా విడుదల చేసిన ఏడు నోటిఫికేషన్లకు సంబంధించి 5,081 ఉద్యోగాలున్నాయి. ఇందులో జనరల్‌ కేటగిరీలో 1062 ఖాళీలుండగా... మహిళలకు ఏకంగా 4019 పోస్టులు రిజర్వ్‌ అయ్యాయి. 

చదవండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు

79.1శాతం కొలువులు వారికే... 

సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఉద్యోగాలన్నీ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారమే కేటాయించినప్పటికీ స్త్రీలకే ఎక్కువ కొలు­వులు దక్కనున్నాయి. తాజాగా విడుదలైన పూర్తిస్థాయి నోటిఫికేషన్లకు అనుగుణంగా 5,081 ఖాళీలకు సంబంధించి మహిళలకు 79.10శాతం, జనరల్‌ కేటగిరీలో 20.90శాతం పోస్టులు రిజర్వ్‌ అయ్యాయి. మహిళలకు కేటాయించిన పోస్టులు మహిళలకే దక్కనుండగా... అర్హత పరీక్షల్లో మెరిట్‌ సా«­దిం­చిన మహిళలకు జనరల్‌ కేటగిరీలోనూ కొలువులు దక్కనున్నా­యి. ఇక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో బాలికల పాఠశాలలు, కళాశాలల్లోని కొలువులన్నీ స్త్రీలకు మా­త్రమే కేటాయించే నిబంధన ఉంది. దీంతో ఆ సంస్థల్లోని కొలువులు మహిళలకు మా­త్రమే దక్కనున్నాయి. ఇకబాలుర పాఠశాలలు,కళాశాలలకు సంబంధించిన కొలువుల్లో 33శాతం రిజర్వేషన్‌ ద్వారా పోస్టులు కేటాయించారు. రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్‌ వరుస మొదటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో మొదటి వరుసలో ఎక్కువగా స్త్రీలకు రిజర్వ్‌ చేసిన పోస్టులే ఉండడంతో వారికి మరింత ఎక్కువ అవకాశం కలిగినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో మ్యూజిక్‌ టీచర్లకు సంబంధించిన 124 ఖాళీలు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ కేటగిరీలో 4,020 ఖాళీలకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పాటు క్రాఫ్ట్‌ కేటగిరీలో మరో ఆరు ఖాళీల భర్తీపై స్పష్టత రానుంది. 

చదవండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు

కేటగిరీల వారీగా గురుకుల పోస్టులు ఇలా..

కేటగిరీ

జనరల్‌

మహిళ

మొత్తం

జూనియర్‌ లెక్చరర్‌

454

1470

1924

లైబ్రేరియన్‌(జూనియర్‌ కాలేజీ)

8

42

50

ఫిజికల్‌ డైరెక్టర్‌(జూ. కాలేజీ)

6

28

34

డిగ్రీ లెక్చరర్‌

101

692

793

లైబ్రేరియన్‌(డిగ్రీ కాలేజీ)

3

33

36

ఫిజికల్‌ డైరెక్టర్‌(డిగ్రీ కాలేజీ)

3

36

39

ఫిజికల్‌ డైరెక్టర్‌

45

230

275

పీజీటీ

310

966

1276

లైబ్రేరియన్‌

102

332

434

క్రాఫ్ట్‌ టీచర్‌

10

78

88

ఆర్ట్‌ టీచర్‌

20

112

132

మొత్తం

1062

4019

5081

గురుకుల సొసైటీల పరిధిలో పోస్టుల వారీగా నోటిఫికేషన్లు ఇలా..

నోటిఫికేషన్‌

పోస్టు కేటగిరీ

ఖాళీలు

01

లెక్చరర్‌/ఫిజికల్‌ డైరెక్టర్‌/లైబ్రేరియన్‌(డిగ్రీకాలేజీ)

868

02

జూనియర్‌ లెక్చరర్‌/ఫిజికల్‌ డైరెక్టర్‌/లైబ్రేరియన్‌(జూనియర్‌ కాలేజీ)

2008

03

పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ)

1276

04

లైబ్రేరియన్‌(స్కూల్స్‌)

434

05

ఫిజికల్‌ డైరెక్టర్‌(స్కూల్స్‌)

275

06

డ్రాయింగ్‌ టీచర్‌/ ఆర్ట్‌ టీచర్‌

134

07

క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌/క్రాఫ్ట్‌ టీచర్‌

92

08

మ్యూజిక్‌ టీచర్‌

124

09

ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌

4020

Published date : 25 Apr 2023 02:57PM

Photo Stories