Skip to main content

Dr Chittem Parnika Reddy: జాయమ్మ చెరువుకు సాగునీరందిస్తా

తాతయ్య (చిట్టెం నర్సిరెడ్డి) రాజకీయాల్లో ఉన్నప్పటికీ నేను రాజకీయాల్లోకి వస్తానని మాత్రం ఊహించలేదు.
Dr Chittem Parnika Reddy, telengana elections,

అమ్మ ఐఏఎస్‌ ఆఫీసర్‌. నాన్న బిజినెస్‌ చేసేవారు. నన్ను డాక్టర్‌ చేయాలని, నేను మా నారాయణపేటలో పేదవాళ్లకు వైద్యసేవలందించాలనేది తాత, నాన్న ఇద్దరి కల. వాళ్లిద్దరూ మావోయిస్టుల దాడిలో ప్రాణాలు పోగొట్టున్న నాటికి నాకు పదకొండేళ్లు. వాళ్ల కల నెరవేర్చాలని డాక్టర్‌నయ్యాను.

చదవండి: TS Elections 2023: ఎన్నికల బరిలో ఇంత‌ మంది అభ్యర్థులు.. నియోజకవర్గాల వారీగా వివరాలివీ..

మహిళల అభివృద్ధి కోసం పనిచేయాలి, తాత ప్రజల కోసం నిర్మించ తలపెట్టిన జాయమ్మ చెరువు ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఆ పని నేను పూర్తి చేయాలి. ఇంత వరకు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యురాలిగా మహిళలు లేరు. నేనే తొలి మహిళా ఎమ్మెల్యేనవుతానన్న నమ్మకం ఉంది.

ప్రజల తీర్పు ప్రతికూలంగా ఉంటే ఇక్కడే ఉండి డాక్టర్‌గా సేవలందిస్తాను. అంతే తప్ప నియోజకవర్గాన్ని వదిలి వెళ్లను. 
– డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి (ఎండీ రేడియాలజీ), నారాయణపేట, కాంగ్రెస్‌ అభ్యర్థి 

Published date : 25 Nov 2023 04:29PM

Photo Stories