Free Coaching for Competitive Examinations: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, స్కాలర్‌షిప్ కూడా..
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు ఉచిత శిక్షణ ఇస్తున్నాయి. తాజాగా ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 5 నెలల ఫౌండేషన్ కోర్సు నిమిత్తం 100 సీట్ల భర్తీకి ఫిబ్రవరి 23న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇందుకోసం నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రైవేట్ శిక్షణ కేంద్రాలకు వెళ్లే స్థోమత లేని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పిస్తోంది. గ్రూప్స్, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌తో పాటు ఇతర పరీక్షల కోసం రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అందజేస్తుంది. సంబంధిత వెబ్‌సైట్‌లో ఈనెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
10న ప్రవేశ పరీక్ష
నిష్ణాతులైన బోధకుల ద్వారా తరగతుల నిర్వహణతో పాటు రూ.1,500 విలువైన స్టడీ మెటీరియల్ అందజేస్తారు. శిక్షణకు ఎంపికై న అభ్యర్థులకు స్కాలర్‌షిప్ రూ. 5 వేలు, భోజన ఖర్చుల కింద రోజుకు రూ.75 చొప్పున, నెలకు రూ. 2,250 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది..
గ్రూప్–1 శిక్షణకు మార్చి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. ఈనెల 10వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత పొందిన 100 మందికి మార్చి 18 నుంచి ఆగస్టు 17 వరకు ఉచిత భోజన వసతి, సౌకర్యాలతో శిక్షణ ఇస్తారు.
గత రెండేళ్లుగా స్టడీ సర్కిల్‌లో 125 మంది అభ్యర్థులు శిక్షణ పొందారు. ప్రస్తుతం 3వ బ్యాచ్ కోసం దరఖాస్తులు స్వీకరణ కొనసాగుతోంది. మరిన్ని వివరాలకు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా అధికారిణి విజయలక్ష్మి సూచించారు.