చిరుద్యోగులకు ఆర్థిక భరోసా
ప్రతిపక్ష నేతగా ఉండగా పాదయాత్ర సమయంలో వారి వెతలను స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2019 జూన్ 10వ తేదీన నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలోనే వారి వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రోజంతా వివిధ డ్యూటీలను నిర్వహించే హోంగార్డుల నుంచి బడి పిల్లలకు మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్, సహాయకులతో పాటు పారిశుధ్య కార్మికులు, అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, డ్వాక్రా గ్రామ సమాఖ్య సహాయకుల వరకు వివిధ రంగాల్లోని లక్ష మందికి పైగా చిరుద్యోగులకు వేతనాలను పెంచి ముఖ్యమంత్రి జగన్ ఊరట కల్పించారు. గత సర్కారు హయాంలో వేతనాలు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెంచిన తరువాత వేతనాలు ఇలా ఉన్నాయి.
ఎవరికి |
ఎంతమంది |
టీడీపీ ప్రభుత్వంలో జీతం (రూ.) |
వైఎస్పార్‌సీపీ ప్రభుత్వం పెంచిన జీతం (రూ.) |
పెరిగిన మొత్తం(రూ.) |
హోంగార్డులు |
16,616 |
18,000 |
21,300 |
3,300 |
అంగన్ వాడీ వర్కర్స్ |
47.377 |
10,500 |
11,500 |
1,000 |
మినీ అంగన్ వాడీ వర్కర్స్ |
6,518 |
6,000 |
7,000 |
1,000 |
అంగన్ వాడీ హెల్పెర్స్ |
45,085 |
6,000 |
7,000 |
1,000 |
సీడబ్ల్యూసీలు |
2.652 |
400 |
4,000 |
3,600 |
డ్వాక్రా గ్రామ సహాయకులు |
27,160 |
3000+2000 |
8000+2000 |
5000 |
ఆశా వర్కర్లు |
41205 |
3000 |
10,000 |
7000 |
ఈఎంటీ(108) |
1600 |
14,000 |
30,000 |
16,000 |
పైలట్ (108) |
1600 |
13,000 |
28,000 |
15,000 |
డ్రైవర్ (104) |
703 |
12500 |
26,000 |
13,500 |
డీఈఓ (104) |
700 |
–––––– |
15,000 |
15,000 |
స్టాఫ్‌నర్స్‌లు |
74 |
15,000 |
22,500 |
7,500 |
మధ్యాహ్నభోజనం కుక్ సహాయకులు |
88,296 |
1000 |
3000 |
2,000 |
పారిశుధ్యకార్మికులు |
–– |
–– |
18,000 |
|
- గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఐటీడీఏల పరిధిలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(సీడబ్ల్యూసీ)లకు 1995 నుంచి కేవలం రూ.400 మాత్రమే వేతనం ఇస్తుండగా ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా రూ.4వేలకు పెంచడం రికార్డు.
- డ్వాక్రా యానిమేటన్లుగా పిలిచే డ్వాక్రా గ్రామ సహాయకులకు గత ప్రభుత్వం రూ.3000 ఇవ్వగా సమాఖ్య రూ.2000 ఇచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఇచ్చే మొత్తాన్ని రూ.8000కు పెంచారు)
చదవండి:
Education: ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చదువులు ఉండాలి: ముఖ్యమంత్రి