జిల్లా సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన
అంతకు ముందు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి నూతన కలెక్టరేట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు చంద్రశేఖర్‌కు డిమాండ్లతో కూడిన వినతి అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ రెడ్డి మాట్లాడారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 25వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇతర రాష్ట్రాల్లోని సమగ్ర శిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం(మినిమమ్ టైమ్ స్కేల్) అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి, కోశాధికారి మురళి తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
DSC 2023 Notification: టీచర్ పోస్టులు @ 43.. పోస్టులు ఖాళీల్లో ఈ జిల్లాదే చివరి స్థానం