DSC 2023 Notification: టీచర్ పోస్టులు @ 43.. పోస్టులు ఖాళీల్లో ఈ జిల్లాదే చివరి స్థానం
ఆరేళ్ల కాలంగా ఆశగా ఎదురు చూస్తుంటే తీరా ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు కేవలం 43 పోస్టులే అంటూ ప్రకటించడం అన్యాయం. ఉపాధ్యాయ నియామక పరీక్షల కోసం ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చినా ప్రభుత్వ ప్రకటన నిరాశకు గురి చేసింది..’ ఇది జిల్లాకేంద్రంలోని చందపల్లికి చెందిన స్రవంతి ఆవేదన.
విద్యార్థుల సంఖ్య తగ్గడమే కారణమా..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతోనే టీచర్ పోస్టులు తగ్గాయని తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కేజబీవీ, మోడల్ స్కూల్‌వంటి పాఠశాలలు అందుబాటులోకి రావడం తో ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు విముఖత చూపుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే రేషనలైజేషన్ ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు చాలావరకు తగ్గాయంటున్నారు.
కేజీబీవీలో సీట్లకు డిమాండ్
బడీడు పిల్లలు బడి బయట ఉంటే వారిని గుర్తించి వారి వయస్సుకు తగ్గట్టుగా వారిలో చదువు సామర్థ్యాన్ని పెంచేలా రెసిడెన్షియల్ పాఠశాలలు పనిచేయాలి. కానీ చాలావరకు ప్రాథమిక విద్య పూర్తి చేసిన బాలికలంతా కస్తూరి బాగాంధీ బాలికా విద్యాలయ్ (కేజీబీవీ) లో చేరి విద్యను పూర్తి చేస్తున్నారు. కేజీబీవీలో తమ పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతుందనే ఆశతో తల్లిదండ్రులు సీటు సంపాదించేందుకు పైరవీలు కూడా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
చదవండి: TS DSC Notification 2023: జిల్లాల వారీగా టీచర్ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే
బడి బయట ఉన్న పిల్లలను గుర్తించినా వారిని ఆయా పాఠశాలల్లో చేర్చుకోవడం లేదనే ఫిర్యాదులున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదవాల్సిన విద్యార్థులంతా ప్రత్యేక పాఠశాలలవైపు చూస్తుండడం వల్లే చాలావరకు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గగా.. కొన్ని పాఠశాలలు మూతపడ్డాయని ఉపాధ్యాయ సంఘ నాయకుడొకరు తెలిపారు.