డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కౌన్సెలింగ్
Sakshi Education
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఏప్రిల్ 12 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈవో విజయేంద్రరావు వెల్లడించారు.
ఈ మేరకు ఆయన ఏప్రిల్ 10న విలేకరులతో మాట్లాడుతూ గతంలో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న 1998 డీఎస్సీ అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. డీఈవో కార్యాలయంలో ఏప్రిల్ 11న నోటీస్ బోర్డులో మెరిట్ లిస్టు ప్రచురించనున్నట్లు తెలిపారు. సంబంధిత అభ్యర్థుల సెల్‌ఫోన్‌లకు సందేశం పంపుతామన్నారు. ఏప్రిల్ 12న (1 నుంచి 350 వరకు), 13వ తేదీన మిగిలిన వారికి కౌన్సెలింగ్ ఉంటుందని వివరించారు. ఐదు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని డీఈవో కోరారు.
చదవండి:
EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..
TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం
Published date : 11 Apr 2023 05:02PM