Skip to main content

Compassionate Appointments: 19 మందికి ‘కారుణ్య’ నియామకాలు

కైలాస్‌నగర్‌: విధి నిర్వహణలో మరణించిన ప్రభు త్వ ఉద్యోగులకు సంబంధించిన కుటుంబీకులకు కారుణ్య నియామకాలు కల్పించారు.
Compassionate appointments for 19 people

19 మందికి సర్కారు కొలువు కల్పిస్తూ కలెక్టర్‌ రాజర్షి షా న‌వంబ‌ర్‌ 6న ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్‌ అసిస్టెంట్లుగా ఆరుగురికి, స్టోర్‌ కీపర్లుగా ఇద్దరికి, ఆఫీస్‌ సబార్డినేట్లుగా పది మంది, వాచ్‌మెన్‌గా ఒకరికి వారి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో పోస్టింగ్‌ కల్పించారు.

చదవండి: TGBIE Inter Exam Fees: ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుద‌ల‌.. చివ‌రి తేదీ ఇదే..

తన కార్యాలయ చాంబర్‌లో వారికి నియామక పత్రాలు అందజేశారు. అంతకు ముందు వారితో మాట్లాడిన కలెక్టర్‌ విధులు సమర్థవంతంగా బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 07 Nov 2024 09:34AM

Photo Stories