Priyank Kharge: పోటీ పరీక్షల తేదీలు మార్చండి
Sakshi Education
శివాజీనగర: వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు ఒకే రోజు మూడు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నందున అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, తేదీలు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్యకు మంత్రి ప్రియాంక్ ఖర్గే విన్నవించారు.
రాష్ట్ర గణాంక పరిశోధన, గణాంక శాఖలో 242 గణాంక అసిస్టెంట్ల ఉద్యోగాలకు, సహకార సంఘాల్లో ఖాళీగా ఉన్న 47 పోస్టులకు, రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 454 సివిల్ కానిస్టేబల్ ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది నవంబర్ 5న పరీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే తమ విద్యార్హతకు, వయో పరిమితికి తగినట్లుగా ఉద్యోగం లభించక చాలా మంది అన్యాయానికి గురయ్యారు.
చదవండి: Indian Navy: నేవీ ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ పరిస్థితుల్లో ఒకే రోజు మూడు పరీక్షలు నిర్వహిస్తే నిరుద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందని మంత్రి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలను వేర్వేరు తేదీల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Published date : 26 Oct 2023 03:39PM