DYFI: ‘నోటిఫికేషన్ లేకుండా నియామకాలు’
Sakshi Education
ఆసిఫాబాద్‌రూరల్: నిబంధనలకు విరుద్ధంగా బీసీ వసతి గృహాల్లో నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ ఆరోపించారు.
జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆగస్టు 3న ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను 27 ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు ఇష్టారాజ్యంగా పంచిపెట్టారని ఆరోపించారు.
బీసీ గురుకులంలో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా వాచ్‌మెన్ తదితర పోస్టులు భర్తీ చేశారని అన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేవారు. కార్యక్రమంలో జిల్లా సహాయక కార్యదర్శి రాజ్‌కుమార్, టీకానంద్, నిఖిల్ ఉన్నారు.
చదవండి: 1600 Jobs in SSC: విజయం సాధిస్తే.. గ్రూప్–సి హోదాలో కేంద్ర కొలువులు
Published date : 04 Aug 2023 01:49PM