Free Coaching: పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు దరఖాస్తులు
Sakshi Education
కరీంనగర్: పోటీ పరీక్షల కోసం జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు మూడునెలల పాటు భోజన వసతితో కూడిన ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ పి.నతానియేలు, డైరెక్టర్ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు.
మార్చి 29లోపు అంబేద్కర్ భవన్‌లోని టీఎస్ స్టడీ సర్కిల్‌లో ఒరిజనల్ సర్టిఫికెట్స్‌తో పాటు రెండు సెట్స్ జిరాక్స్ కాపీలతో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు.
చదవండి: Free Coaching for TSPSC Group Exams: గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు ఉచిత శిక్షణ
ఎస్సెస్సీ, డిగ్రీ మార్కుల మెమో, ప్రొవిజనల్, కులం, ఆదాయం సర్టిఫికెట్స్, ఆధార్, రేషన్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, రెండు పాసుపోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 98852 18053, 95734 01227, 91776 05511 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
Published date : 28 Mar 2024 03:40PM