Sameer Sharma: అధికారులు, ఉద్యోగుల శిక్షణకు ఏపీ అకాడమీ ఆఫ్ గవర్నెన్స్
అనుబంధంగా జిల్లా శిక్షణ కేంద్రాలు
విశాఖ, విజయవాడ, తిరుపతిలో అకాడమీ ప్రాంతీయ కేంద్రాలను నిర్వహిస్తుంది. ప్రాంతీయ కేంద్రాలకు అనుబంధంగా జిల్లా శిక్షణ కేంద్రాలు సైతం ఏర్పాటు కానున్నాయి. ఈ అకాడమీ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అకాడమీ ప్రాంతీయ కేంద్రాలు జిల్లాల్లోని మధ్యస్థాయి సీనియర్ ఉద్యోగులకు శిక్షణ ఇస్తాయి. జిల్లా కేంద్రాలు జూనియర్ స్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇస్తాయి. ప్రభుత్వ సంక్షేమం, సామాజిక, ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అకాడమీ 9 రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చే స్తుంది. ఇందులో భాగంగా పర్సనల్ మేనేజ్‌మెం ట్ అండ్ ఆర్గనైజేషనల్ డెవలప్‌మెంట్ సెంటర్, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ల్యాండ్ గవ ర్నెన్స్, వాటర్ గవర్నెన్స్, సెంటర్ ఫర్ ఎనర్జీ గవ ర్నెన్స్, ఆరోగ్యం, విద్య, పిల్లల రక్షణ, గ్రామీణ పా లన అభివృద్ధి, అర్బన్ గవర్నెన్స్ అండ్ డెవలప్ మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ కేంద్రాలు ఏర్పాట వుతాయి. ఈ కేంద్రాలు విద్యా కార్యకలాపాలను రూపొందించుకునే స్వేచ్ఛను కలిగి ఉంటాయి. అన్ని ప్రభుత్వ శాఖల విధానాల రూపకల్పన, శిక్షణ, పరిశోధనలపై అకాడమీ దృష్టి సారిస్తుంది. బోధనా ప్రణాళికలు, కోర్సులకు రూపకల్పన చేస్తుంది. రాష్ట్రస్థాయిలోని ఉన్నతాధికారులకు శిక్షణ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు అందించే సర్టిఫికెట్ కోర్సులను రూపొందిస్తుంది. పూర్తి ఆన్ లైన్ కోర్సులను అందిస్తుంది. ముఖ్యమంత్రి అధ్యక్షునిగా అకాడమీ పాలకమండలి ఏర్పాటవుతుంది.