APVVP: 43 వైద్యుల పోస్టులు భర్తీ
. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు డిసెంబర్ 14న ఐదు స్పెషాలిటీల్లో 77 పోస్టులను నోటిఫై చేశారు. ఇందులో జనరల్ మెడిసిన్ 25, జనరల్ సర్జరీ 16, డెర్మటాలజీ 2 చొప్పున ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 15న పోస్టింగ్ ఉత్తర్వులు జారీచేశారు. 16న అనస్తీషియా 34, గైనకాలజీ 32, ఈఎన్‌టీ 11, పాథాలజీ 29 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు అభ్యర్థులు విజయవాడ పాత జీజీహెచ్ ప్రాంగణంలోని డీఎంఈ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.
చదవండి: NMC: కొత్త వైద్య కళాశాలల దరఖాస్తుకు గడువు పెంపు
సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల
డీఎంఈ పరిధిలో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రాథమిక మెరిట్ జాబితా, తిరస్కరించిన దరఖాస్తుల వివరాలను డిసెంబర్ 15న విడుదల చేశారు.
చదవండి: NIMS Recruitment 2022: హైదరాబాద్ నిమ్స్‌లో 46 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..