3, 432 Jobs: జిల్లా కోర్టుల్లో పోస్టుల భర్తీ పరీక్షల షెడ్యూల్
Sakshi Education
సాక్షి, అమరావతి/గుంటూరు లీగల్: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో వివిధ కేటగిరీలకు సంబంధించి 3,432 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన హైకోర్టు, తాజాగా ఆ పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు డిసెంబర్ 21, 22, 23, 29, జనవరి 2 (2023) తేదీల్లో ఉమ్మడిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు డిసెంబర్ 26న కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు డిసెంబర్ 26, 27, 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు.
చదవండి: Supreme Court: సుప్రీంకోర్టులో మరో 4 ప్రత్యేక ధర్మాసనాలు
డిసెంబర్ 16 నుంచి హైకోర్టు, జిల్లా కోర్టుల వెబ్‌సైట్లలో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. పరీక్ష వేదిక, సమయం వంటి వివరాలను హాల్‌టికెట్లలో పొందుపరుస్తారు. ఈ మేరకు రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్) ఎస్.కమలాకర్‌రెడ్డి నవంబర్ 23న ఓ నోటిఫికేషన్ జారీ చేశారు.
Published date : 24 Nov 2022 04:04PM